ఫ్రిజ్ డోర్స్ ను తెరవటం కోసం కొత్త హ్యాండిల్స్ రెడీ చేసిన ఫిన్నిష్ దుకాణ దారులు

కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా..... ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. వేరొకరు తాకకుండా చేయటం ముఖ్యం.

ఫ్రిజ్ డోర్స్ ను తెరవటం కోసం కొత్త హ్యాండిల్స్ రెడీ చేసిన ఫిన్నిష్ దుకాణ దారులు

కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి.  వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో  భాగంగా….. ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. వేరొకరు తాకకుండా చేయటం ముఖ్యం.

అయితే వాటిలో డోర్ హ్యాండిల్స్ ను ఇతరులు తాకకుండా చేయటం కష్టం. ఎందుకంటే తలుపు తెరవాలంటే ప్రతిసారి డోర్ హ్యాండిల్ ను పట్టుకోవాలి.

ఫిన్లాండ్ లోని దుకాణదారులు త్వరలో సూపర్ మార్కెట్ లోని ఫ్రీజ్ డోర్స్ ను తెరవటం కోసం ‘Fortum lever’  అనే ఒక కొత్త హ్యాండిల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక నుంచి ఫ్రీజ్ డోర్స్ తెరవాలంటే మీ చేతికి బదులుగా మోచేతిని ఉపయోగించాలి.

ఫోర్టమ్ అనే ఫిన్నిష్ ఎనర్జీ సంస్ధ ఫ్రీజర్ డోర్స్ ను తెరవటం కోసం ‘Fortum lever’ ను తయారు చేసిందని Helsinki Times తెలిపింది.

ఫ్రిజ్ డోర్ లకు అమర్చిన ‘Fortum lever’ హ్యాండిల్ పై మోచేతిని ఉంచి  హ్యాండిల్ పట్టుకోకుండా తలుపు తెరవటం, లాగటం చేయవచ్చు. ఈ హ్యాండిల్ ను ఉపయోగించటం ద్వారా వ్యాధిని వ్యాపించకుండా చేయవచ్చు.

ఇది ఇప్పటికే  Helsinki Times ఎంపిక చేసిన Alepa సూపర్ మార్కెట్ లో పరీక్షించబడుతోంది. అంతే కాకుండా రాబోయే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ రకమైన కొత్త పద్ధతి మరి ఎక్కడైనా అందుబాటులో ఉందో లేదో తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం డోర్ హ్యాండిల్ కు సంబంధించిన నిబంధనలు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.