వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!   

  • Published By: sreehari ,Published On : February 14, 2020 / 12:14 PM IST
వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!   

వూహాన్‌లో వైద్యసిబ్బందికి విశ్రాంతి లేదు. రోజుకు 18-20 గంటల మేర పని. కనీసం నిద్రకూడా సమయంలేదు. నింగ్ ఝూ కూడా ఇలాంటి నర్సే. డాక్టర్లకు సాయం చేయడానికి బదులు తానే గదిలో నిర్భందించుంది. జనవరి 26 లో చెస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఆమెకు కరోనా వైరస్ ఉందోమేనన్న అనుమానంతో బైటకు రావడంలేదు. nucleic acid test కోసం వెయిట్ చేస్తోంది. అప్పటికాని కరోనా వచ్చిందా? లేదా అన్నది తేలియదు. ఇప్పుడు ఇదే ప్రొబ్లమ్. చాలా హాస్పటల్స్ లో బెడ్స్ సరిపోక ఇళ్ల దగ్గరే పేషెంట్లను చూస్తున్నారు. ఈమె పనిచేస్తున్న హాస్పటల్ లోనే 30 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకింది.

తనకి కరోనా టెస్ట్ లో నెగిటీవ్ వస్తే హాస్పటల్ కెళ్లి సేవలు చేయాలని తహతహలాడుతోంది. చైనాకొచ్చిన ఈ సంక్షోభం త్వరగా పోవాలన్నది ఆమె కోరిక. అలాగని కరోనా లక్షణాలన్నీ ఆమెకు లేవు. సీటీ స్కాన్ లో చిన్న తేడా కనిపించింది. రిస్క్ చేయడం ఇష్టంలేక తనను తాను నిర్భందించుకుంది. ఆమె అంచనా ప్రకారం..మొత్తం 500 మంది వైద్య సిబ్బందిలో ఇప్పటికే 130 మంది వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 60 వేలు. CNNకు ఇచ్చిన ఇంటర్వూలో తాను పనిచేసే హాస్పటల్ పేరుచెప్పడానికి నిరాకరించింది. మారుపేరుతో ఇంటర్వ్యూ ఇచ్చింది.

వూహాన్‌లో డాక్టర్లకు కరోనా
ఆమె పనిచేస్తున్న హాస్పటల్ మాత్రమేకాదు, చాలా చోట్లా ఇదే పరిస్థితి. కరోనా బాధతులకు వైద్యం చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది కూడా వైరస్ బారినపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బలవుతున్నారు. వూహాన్ సెంట్రల్ హాస్పటిల్ నర్స్ కూడా Weiboలోకూడా ఇదే మాట చెప్పుకొచ్చింది. ఆమెతో సహా టీంలోని 150 మందికి వైరస్ సోకిదంట. డాక్టర్లే కరోనా బారినపడితే మరి వైద్యం చేసేదెవ్వరు? నెల రోజులపాటు ఇంట్లో గదిలో ఉన్న ఆమెకు కరోనా పాజిటీవ్ రావడంతో సొంత ఆసుపత్రిలోనూ చేరింది. ఒక్కో రూంలో ఇద్దరు, ముగ్గురు ఉండాల్సి వస్తోంది. వైద్య సిబ్బంది వేసుకొనే సూట్స్ మీద వాళ్ల పేరు రాస్తున్నారు. ఒకరిది మరొకరు వేసుకోకుండా ముందు జాగ్రత్త.

తనను పరీక్షించడానికి వైద్యసిబ్బంది వచ్చినప్పుడల్లా ఆమె ఊపిరిని బిగబడుతోంది. వాళ్లను తొందరగా వెళ్లిపోమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. తన ఊపిరి వల్ల వైరస్ పక్కవారికి సంక్రమిస్తుందున్న భయం ఆమెది. శుక్రవారంనాటికి చైనా వైద్యశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1,716 మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. ఇందులో ఆరుగురు చనిపోయారు. ఇందులో్ 90శాతం మంది రాజధాని వూహాన్ లోని Hubei రాష్ట్రానికి చెందినవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!