మార్చి 1 నుంచి రెండో దశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ : ఎవరెవరికి టీకా? అందరికి వేస్తారా? ఖరీదు ఎంతంటే?

మార్చి 1 నుంచి రెండో దశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ : ఎవరెవరికి టీకా? అందరికి వేస్తారా? ఖరీదు ఎంతంటే?

Covid-19 vaccination Phase 2 drive: దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ దశలో 60ఏళ్లకు పైబడినవారితో పాటు 45ఏళ్లు పైబడినవారికి కరోనా టీకాను ఇవ్వనున్నారు. వీరిలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రథమంగా టీకాను అందించనున్నారు. ప్రపంచ అతిపెద్ద ఇమ్యూనైజేషన్ క్యాంపెయిన్ లో భాగంగా దేశంలో దాదాపు అన్ని ప్రైవైటు ఆస్పత్రుల్లో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో జనవరి 16న మొదటి దశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

ముందుగా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకూ ఇండియాలో 14,242,547 మందికి కరోనా షాట్లు అందించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో వ్యాక్సినేషన్ రికార్డు అయిందని ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. కరోనా వ్యాక్సినేషన్ శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు నిలిపివేయనుంది. Co-WIM యాప్ లో తరువాత దశ గురించి అప్ డేట్ చేయనున్నారు. కోవిడ్-19 రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా కొనసాగనుంది.
Covid-19 vaccination Phase 2.45-60 ఏళ్ల వయస్సువారిలో ఎవరు అర్హులు:
కోవిడ్-19 వ్యాక్సినేషన్ రెండో దశ జాబితాలో 45ఏళ్లు పైబడిన కోమోర్బిడిటీల్లో ఎవరూ టీకా తీసుకునేందుకు అర్హులు అనేదానిపై ప్రభుత్వం ఇంకా లిస్టును రిలీజ్ చేయలేదు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ లేదా గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు, లివర్ లేదా కిడ్నీ సమస్యలు లేదా స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ వేసే చోట ఎవరైనా కోమోర్బిడిటీల్లో ఈ తరహా వ్యాధులతో బాధపడుతున్నవారైతే ఏదైనా మెడికల్ ప్రాక్టిషనర్ నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడే వారికి టీకాను అందించనున్నారు.

టీకాకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం :
ప్రభుత్వం ఆమోదించిన 12 ఐడీ కార్డులను టీకా కోసం వినియోగించుకోవచ్చు. అందులో ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, లేబర్ స్కీమ్, MGNREGA జాబ్ కార్డు, వోటర్ ఐడీ కార్డులు, MPs/MLAs/MLCs ఐడీ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంకు లేదా పోస్టుఆఫీసు పాస్ బుక్, పాస్ పోర్టు, పెన్షన్ డాక్యుమెంట్, central/state govt/PSUs జారీ చేసిన సర్వీసు ఐడెంటిటీ కార్డులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, నేషనల్ పాపులైజేషన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా స్మార్ట్ కార్డులు కూడా వినియోగించుకోవచ్చు.

టీకా ఖరీదు ఎంతంటే? :
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టీకాలను ఉచితంగా అందించనున్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా టీకాలను అందించనున్నారు. అయితే ప్రైవేటుగా అందించే కరోనా టీకా ఎంత ఖరీదు ఉంటుందో ఇంకా రివీల్ చేయలేదు. మొదటగా 100 మిలియన్ డోస్‌ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ రూ.200 వరకు ఉండొచ్చు. ఆ తర్వాత ఒక్కో డోస్ ధర రూ.1000 వరకు పెరిగే అవకాశం ఉంది.
Covid-19 vaccination Phase 2.ఇంతకీ ఏ వ్యాక్సిన్ ఇస్తారంటే :
తొలి దశ వ్యాక్సినేషన్ లో రెండు వ్యాక్సిన్లలో ఏదొకటి ఎంచుకునేందుకు అనుమతి లేదు. కోవిషీల్డ్ (ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా) అభివృద్ధి చేయగా.. SII టీకాను తయారుచేసింది. రెండో వ్యాక్సిన్ కోవాగ్జిన్.. ఈ టీకాను భారత్ బయోటెక్ డెవలప్ చేసి తయారు ేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఇదే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

టీకాను ఎక్కడెక్కడ వేస్తారంటే? :
దేశవ్యాప్తంగా ఇప్పటికే 2వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. అయూస్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY), సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) కింద 12వేల ఆస్పత్రుల్లో టీకాను అందించనున్నారు.

టీకా కోసం కాలినడకన అనుమతిస్తారా? :
కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇదివరకే రిజిస్టర్ అయినవారికి మాత్రమే కాలినడకన టీకా తీసుకునేందుకు అనుమతించనున్నారు.
రెండో డోస్ కోసం ఎప్పుడు రావాలి? :
మొదటి డోస్ ప్రక్రియ అందరికి ఇవ్వడం పూర్తి అయిన తర్వాతే రెండో డోస్ ప్రారంభం కానుంది. క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికేట్ మొదటి డోస్ తీసుకున్న వ్యక్తి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పంపడం జరుగుతుంది. కో-విన్ యాప్ సిస్టమ్ ద్వారా ఈ కోడ్ జనరేట్ అవుతుంది. మొదటి డోస్ పొందగానే సదరు వ్యక్తికి ఒక ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ లింకుతో వస్తుంది.. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం.. ఆ వ్యక్తికి రెండో డోస్ ఎప్పుడు ఎక్కడ? ఏ సమయంలో డోస్ ఇవ్వనున్నారో అంతా అందులోనే ఉంటుంది.