ఆసియాలో అతిబరువైన మహిళ : అప్పుడు 300 కిలోలు.. ఇప్పుడు 86 

అప్పుడు ఆమెకు ఆరేళ్లు.. పుట్టినప్పుడు అందరిలానే మామూలుగా ఉండేది. ఆమె బరువు 3.5 కిలోలు. కానీ, ఆరేళ్లు దాటగానే అధిక బరువు ఆమె పాలిట శాపంగా మారింది. ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది.

  • Published By: sreehari ,Published On : May 9, 2019 / 11:06 AM IST
ఆసియాలో అతిబరువైన మహిళ : అప్పుడు 300 కిలోలు.. ఇప్పుడు 86 

అప్పుడు ఆమెకు ఆరేళ్లు.. పుట్టినప్పుడు అందరిలానే మామూలుగా ఉండేది. ఆమె బరువు 3.5 కిలోలు. కానీ, ఆరేళ్లు దాటగానే అధిక బరువు ఆమె పాలిట శాపంగా మారింది. ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది.

అప్పుడు ఆమెకు ఆరేళ్లు.. పుట్టినప్పుడు అందరిలానే మామూలుగా ఉండేది. ఆమె బరువు 3.5 కిలోలు. కానీ, ఆరేళ్లు దాటగానే అధిక బరువు ఆమె పాలిట శాపంగా మారింది. 16ఏళ్లు వచ్చేసరికి 126కిలోల బరువుకు చేరింది. ఏం పనిచేయాలన్న కష్టం. ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరి సాయం తప్పనిసరి.  ఎన్నో ఆస్పత్రులు తిరిగింది. ఎన్నో మందులు వాడింది. అయినా ఫలితం శూన్యం. అధిక బరువుకు కారణం అంతుపట్టలేదు. విదేశాలకు సైతం వెళ్లి పెద్ద డాక్టర్లకు చూపించారు. వాళ్లూ చేతులేత్తేశారు. చివరికి ఇండియాలోనే ఆమెకు 42ఏళ్ల వయస్సులో అధిక బరువు నుంచి విముక్తి కలిగింది. ఆమె ఎవరో కాదు.. పుణెకు చెందిన అమృత రజని (42).. ఆసియాలోనే అతిబరువైన మహిళగా రికార్డుకెక్కింది.

8ఏళ్ల పాటు మంచానికే :
300 కిలోల బరువుతో ఏళ్ల తరబడి బాధపడిన అమృత.. ప్రస్తుతం బరువు ఎంతో తెలుసా? కేవలం 86 కిలోలు. నాలుగేళ్లలో బరియాట్రిక్ సర్జరీలను రెండు సార్లు చేయించుకుంది. దీంతో అమృత బరువు 86కిలోలకు తగ్గింది. బరియాట్రిక్ సర్జన్ శశాంక్ షా.. రజనికి సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం అమృత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎనిమిదేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాను. అప్పట్లో. నేను బాత్ రూంకు వెళ్లాలంటే నా పక్కన ఇద్దరి సాయం తప్పనిసరి. దాదాపు 50 నిమిషాల సమయం పట్టేది.  సాధారణ జీవితంలోకి మళ్లీ నేను తిరిగి వస్తానని ఎప్పుడు అనుకోలేదు’ అని తెలిపింది.  

పుట్టినప్పుడు 3.5 .. ఆరేళ్లప్పుడు 126
1973లో అమృత జన్మించింది. అప్పుడు 3.5 కిలోల బరువు ఉంది. ఆరేళ్ల తర్వాత 126కిలోల బరువు పెరిగిపోయింది. డిగ్రీ సమయంలో ఆమె బరువు 160 కిలోలు. 27ఏళ్లు దాటక అమృత పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. రోజువారీ పనులు చేసుకోవాలన్నా ఎంతో ఇబ్బందులు పడేది. 32ఏళ్ల వయస్సు వచ్చాక పూర్తిగా మంచానికే పరిమితమైంది. వ్యాయామాలు, స్లిమ్మింగ్ పిల్స్, లిక్విడ్ డైట్స్ ఇలా ఎన్నో మందులు వాడింది. ఇందుకోసం 20 లక్షల వరకు ఖర్చు పెట్టింది. 2015లో పుణెలోని ఓ ఆస్పత్రికి వెళ్లి తొలిసారి వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుంది. 

తొలి సర్జరీ.. 130 కిలోలు తగ్గింది :
ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్టోనోమీ ద్వారా సర్జరీ చేసి ఫ్యాట్ తొలగించారు. తొలి సర్జరీ పూర్తయిన రెండేళ్ల తర్వాత రజని బరువు 130 కిలోలు తగ్గిపోయినట్టు సర్జరీ చేసిన సర్జన్ శషాంక్ షా తెలిపారు. 2017లో అమృతకు రెండో సర్జరీ చేశారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా వెయిట్ లాస్ సర్జరీ పూర్తి చేశారు. రెండో సర్జరీ తర్వాత అమృత బరువు 86కిలోలకు క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు సాధారణ వ్యక్తుల్లా హాయిగా తన సొంత పనులు తానే చేసుకుంటోంది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంట్రీ కోసం అమృత ఎదురుచూస్తోంది.