కరోనాను జయించేందుకు..ఇమ్యూనిటీ పెంచే ఐదు రకాల పండ్లు

  • Published By: nagamani ,Published On : September 8, 2020 / 04:54 PM IST
కరోనాను జయించేందుకు..ఇమ్యూనిటీ పెంచే ఐదు రకాల పండ్లు

కరోనా మహమ్మారిని జయించాలంటే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే తప్పనిసరిగా పండ్లు తినాలి. మహమ్మారి దరి చేరకూడదంటే ప్రతీరోజు జామ, అయోన్లా,బేల్, జామున్, మామిడి పండ్లు తినాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. వీటిని ప్రతీరోజు మన ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో ఈ మొక్కల్ని చాలామంది తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. రాబోయేకాలంలో కూడా బలంగా ఉండేందుకు.


సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రోపికల్ హార్టికల్చర్ (సిష్) ఈ పండ్ల మొక్కల్ని పెంచుతోంది. కిచెన్ గార్డెన్ ప్రేమికులకోసం..రైతులకు జామ, అయోన్లా (ఇండియన్ గూస్బెర్రీ),బేల్, జామూన్,మామిడి పండ్ల మొక్కలను అందిస్తోంది. ఈ పండ్లలో ఏఏ ప్రయోజనాలున్నాయో..ఏఏ విటమిన్లు ఉన్నాయో..అవి మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

గువా (జామకాయ) పండు ఆరోగ్యాల మెండు
జామకాయ..సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో ఉండే పండు. జామకాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. జామ పండు ఆరోగ్యప్రదాయని. పోషకాల గని. ఒక్క జామపండు పది యాపిల్స్‌ కు సమానం అని నిపుణులు కూడా అంటుంటారు.విటమిన్‌ C పుష్కలంగా లభ్యమయ్యే జామపండ్లను చిన్న పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చు. ఆఖరికి మధుమోహం, గుండెజబ్బులు ఉన్నవారు సైతం జామపండ్లను తినవచ్చని సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీని పెంచటమే కాకుండా కళ్లకు రక్షణ ఇస్తుంది. ఒక్క జామపండు తింటే మనం తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

దంతాలు, చిగుళ్లవాపు, గొంతు నొప్పిని అరికడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. జామపండు గింజల్లో ఒమోగా-3 ఒమోగా-6 కొవ్వు అమ్లాలు, పీచు పదార్ధలు ఉంటాయి. మెగ్నీషియం, కెరబోనాయిడ్లు ఉండడంవల్ల దంత సమస్యలు తగ్గిపోతాయి. దీంట్లో ఉండే పీచు పదార్ధం మల్లబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది.

ఏ బీ సీ విటమిన్లు.
జామ పండులో విటమిన్‌ ఏ, బీ, సీ విటమిన్లు ఉన్నాయి. క్యాల్షియమ్‌, పొస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలీక్‌యాసిడ్‌ మెండుగా లభిస్తాయి.

పోషకాలు బొలెడు..
100 గ్రాముల జామ పండులో 0.3గ్రాముల కొవ్వు , 0.9గ్రాముల ప్రొటీన్‌, 5.2 గ్రాముల పీచు పదార్ధం, 212 మిల్లీ గ్రాముల సీ విటమిన్‌, 5.5మిల్లీ గ్రాముల సోడియం, 91 మిల్లీ గ్రాముల ఇనుము, 51 కిలో కాల్యలరీల శక్తి లభిస్తాయి.


బేల్ పండు (మారేడు పండు)
బేల్ పండు అంటే మారేడు పండు. మారేడు దళాలు అంటే ఆకులు అంటే పరమశివుడికి చాలా ఇష్టమైనవి. మారేడు ఆకులతో పూజ చేస్తే శివుడు ఆయురారోగ్యాలు ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అది పక్కన పెడితే..మారేడు పండ్లు,కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధాలేనని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. మారేడు పండ్లతో
మినరల్స్, విటమిన్స్, కాల్షియం , పాస్పరస్ , ఇనుము , కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచటంతో చాలా బాగా ఉపయోగపడతాయి.

జామూన్ (నేరేడు పండు)
నేరేడు పండు. మిటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో నేరేడు పండు బాగా ఉపయోగపడుతుంది.నల్లగా నిగనిగలాడే నేరేడు పండ్లు వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. నేరేడు పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు మనకు చక్కటి శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు..చాలారకాల రోగాలనూ మన శరీరంలోకి రాకుండా నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలంగా ఉంటాయి.ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. పండులోని ఐరన్ కంటెంట్ మీ హిమోగ్లోబిన్ సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ మరియు యాంటీ మలేరియల్ లక్షణాలను కలిగి ఉంది.




అయోన్లా పండు (ఉసిరి జాతికి చెందినది)
అయోన్లా ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది . ఈ పండు విటమిన్ సి, కాల్షియం, భాస్వరం మరియు ఇనుముల గని అని చెప్పుకోవచ్చు. అయోన్లా రసం రోగనిరోధక శక్తిని అధికంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ పండుకు మంచి గుర్తింపు ఉండటంతో దీనికి మంచి డిమాండ్ ఉంది.

ఈ పండు ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైన ఆహారాలలో ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.జలుబు..దగ్గుతో లాంటి వైరల్ బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది. జుట్టుకు..చర్మానికి చక్కటి అందాన్నిస్తుంది. అంతేకాదు..ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడే పాలీఫెనాల్స్ శక్తిని కలిగి ఉంది.

మామిడి పండు
దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్.. ఎందుకంటే అన్ని పండ్ల‌లో ఉండే పోష‌కాలు మామిడి పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల సీజన్ లో వచ్చే మామిడి పండ్ల‌ను క‌చ్చితంగా తినాలి. ఒక మీడియం సైజు మామిడి పండులో దాదాపుగా 122.3 మిల్లీగ్రాముల విట‌మిన్ C ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


మామిడి పండ్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్ల రొమ్ము , పెద్ద పేగు క్యాన్సర్లు రావని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు నిద్ర సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు రాత్రి ఒక మామిడి పండును తింటే చక్కగా నిద్ర పడుతుంది.

ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి స్ట్రా బెర్రీస్..కివీ దానిమ్మ,బొప్పాయి పండ్లు..పుట్టగొడుగులు, టమోటాలు, క్యాప్సికమ్, బ్రోకలీ తినాలి.