ఇమ్యూనిటీ పెరగాలంటే…ఈ ఆరు విటమిన్ C ఫ్రూట్స్‌ను తీసుకోండి.

ఇమ్యూనిటీ పెరగాలంటే…ఈ ఆరు విటమిన్ C  ఫ్రూట్స్‌ను తీసుకోండి.

కరోనా వైరస్ వల్ల వందలమంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ అందర్నీ వణికిస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం విటమిన్ C ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే?

1. ఆమ్లా:

ఈ పండ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇది శక్తవంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు నాడి వ్యవస్థ, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతోంది. రోజుకు ఒక ఆమ్లా తినడం వల్ల విటమిన్ C శరీరానికి అందుతోంది.

2. కివి:

ఈ ఫ్రూట్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుంటే చాలు సంవత్సరం అంతా కొన్ని ప్రధానమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు . ఈ ప్రూట్ తినడానికి కొద్దిగా పుల్లగా ఉన్నా వీటి వల్ల వివిధ రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

3. క్యాప్సికమ్:

రోజు ఒక కప్పు గ్రీన్ క్యాప్సికమ్ నుంచి 120 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. అలాగే వీటి నుంచి ఫైబర్ కూడా పొందవచ్చు. కాబట్టి తరచుగా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.

4. బొప్పాయి:

బొప్పాయిని తరచుగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యతోపాటు చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయపడతాయి. అలాగే ఎముకలు బలంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక కప్పు బొప్పాయి ముక్కల నుంచి విటమిన్ సి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

5. జామకాయ:

మార్కెట్ లో చౌకగా లభించే జామ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జామపండులో దాదాపు 228 MG విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మీ డైట్ లో జామపండు కచ్చితంగా తినాలి.

6. నిమ్మకాయ:

నిమ్మపండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మకాయలో 53 మిగ్రాల విటమిన్ సి ఉంటే, నిమ్మ పండులో 29.1 మిగ్రాల విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లలో తక్కువ కాలరీలు మరియు సున్నా కొలెస్ట్రాల్ ఉంటాయి.