శృంగారంలో భావప్రాప్తి, స్కలనం తర్వాత 6 ఆశ్చర్యకరమైన లక్షణాలు కనిపిస్తాయి.. ఎందుకో సైంటిస్టులకే అంతుపట్టడం లేదు!

శృంగారంలో భావప్రాప్తి, స్కలనం తర్వాత 6 ఆశ్చర్యకరమైన లక్షణాలు కనిపిస్తాయి.. ఎందుకో సైంటిస్టులకే అంతుపట్టడం లేదు!

New Project (13)

పడక గదిలో రెచ్చిపోయే దంపతుల్లో భావప్రాప్తి.. స్ఖలనం.. ఈ రెండు కనిపిస్తే.. శృంగారం క్లైమాక్స్‌‌కు వచ్చినట్టే అర్థం.. ఆడ, మగవారిలో ఈ రెండు పదాలు వేరైనా భావాలు మాత్రం ఒక్కటే.. అలాగే వీటిని ఎన్నో విధాలుగా వర్ణించొచ్చు. కానీ, ఒక విషయంలో ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిందే.. భావప్రాప్తి కలిగింది అంటే.. సంతృప్తిచెందినట్టే అని అర్థం చేసుకోవాలి. చాలామందిలో భావప్రాప్తి, స్ఖలనం ప్రక్రియ ఎంతో మనోహారంగా ఉంటుంది. కానీ, ఊహాజనితమైనదిగా చెప్పవచ్చు. శృంగారం తర్వాత శరీరం రిలాక్సీ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కానీ, ఇలాంటి సమయాల్లో ఆడ, మగవారిలో ఊహించని విషయాలు బయటపడతాయి.

అప్పటివరకూ హాయిగా అనిపించినా.. అసలు సమస్యలు ఇక్కడే కనిపిస్తాయి. భావప్రాప్తి, స్ఖలనం తర్వాత చాలామంది మహిళల్లో ఆకస్మాత్తుగా తలనొప్పిగా ఉంటుంది. తుమ్మలు వస్తుంటాయి లేదా ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే.. భావప్రాప్తికి సంబంధించి టన్నుల కొద్ది డేటా ఉంది. దీనిపై డేటా రీసెర్చర్లు సైతం కచ్చితమైన ఆధారాలను పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు. భావప్రాప్తి కలిగినప్పుడు మీలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. కొన్ని అరుదుగా జరుగుతుంటాయి. మరికొన్ని చాలా సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, మన శరీరంలో జరిగేవన్నీ ఆసక్తికరమైన అంశాలుగానే చూడాలి.
woman sneezing

1. తలనొప్పి రావొచ్చు :
శృంగారంలో క్లైమాక్స్ దశ.. భావప్రాప్తి కలుగుతుంది. అప్పుడే ఉన్నట్టుండి తలనొప్పిగా అనిపిస్తుంది. స్ఖలనం, భావప్రాప్తితో వచ్చే తలనొప్పి పురుషుల్లో చాలా సర్వసాధారణం. మరికొంతమంది మైగ్రేన్‌తో బాధపడుతుంటారని Mayo Clinic అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి తలనొప్పులు కొన్ని నిమిషాలకు తగ్గిపోతాయి. కానీ, కొన్ని గంటల తర్వాత మళ్లీ తలనొప్పిగా అనిపించడం లేదా కొన్ని రోజుల పాటు తలనొప్పి వచ్చి పోతుంటుంది. మరికొంతమందిలో తల దిమ్ముగా అనిపిస్తుంది. చాలామందిలో తీవ్రంగా తలనొప్పి వచ్చేస్తుందని Laurie Mintz తెలిపారు.
Headeche

ఎందుకిలా తలనొప్పి వస్తుందో పూర్తిగా అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ శృంగారం సమయంలో adrenaline శరీరంలో తలపైవరకు ప్రసరిస్తుందని భావప్రాప్తి అనంతరం తలనొప్పి వస్తుందని కొందరు నిపుణులు నమ్ముతున్నారు. శృంగారంతో వచ్చే తలనొప్పుల విషయంలో ఆందోళన అక్కర్లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం అంతర్లీన అనారోగ్య సమస్యలుగా గుర్తించాలి. ప్రత్యేకించి వాంతులు, మెడ పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యునికి చూపించుకోవడం మంచిందంటున్నారు నిపుణులు.. లేదంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

2. కన్నీళ్లు వస్తాయి :
భావప్రాప్తి, స్ఖలనం తర్వాత ఒక్కసారిగా కళ్లలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. ఎందుకిలా జరుగుతుందో నిపుణులు సైతం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది లేదని, శృంగారం సమయంలోమానసిక మార్పుల కారణంగా ఇలా జరుగుతుంటుందని అంటున్నారు. దీన్నే Postcoital Dysphoria అని కూడా పిలుస్తారని సెక్స్ థెరపిస్ట్ Vanessa Marin, హాఫ్ పోస్టుతో అంటున్నారు.
tears
చాలామందిలో భావోద్వేగానికి గురినట్టుగా ఫీలవుతుంటారని మారిన్ తెలిపారు. శృంగారం తర్వాత ఎవరిలో కన్నీళ్లు వస్తాయో వారి భాగస్వామితో అంతర్లీనంగా ఏదో సమస్య ఉందని సంకేతంగా పరిగణించవచ్చు. కానీ, అది కచ్చితంగా వాస్తవమని చెప్పలేం. చాలామందిలో సంతోషకరమైన సమయాల్లో కూడా కన్నీళ్లు వస్తుంటాయని Mintz తెలిపారు.

3. హాయిగా.. ఉత్సాహంగా అనిపించడం :
స్ఖలనం, భావప్రాప్తి కలిగినప్పుడు సాధారణంగా చాలామందిలో కనిపించే విషయం. కానీ, కొంతమందిలో శృంగారం అనంతరం పాజిటివ్ ఫీలింగ్స్ అనిపిస్తుంటాయి. కొంతమందిలో ఉత్సాహ స్థాయి అత్యధికంగా కనిపిస్తుందని Marin తెలిపారు. వారి మూడ్ కూడా చాలా మెరుగువుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొలా ఎందుకు ఇలాంటి వేర్వేరు స్పందనలు ఉంటాయో ఎవరికి అర్థం కాని విషయమే.
couples

4. తుమ్ములు వస్తాయి:
శృంగారం అనంతరం తుమ్ములు వస్తాయా? ఇదేంటీ అనుకుంటున్నారా? రీసెర్చర్లు సైతం ఇలానే అన్నారు. తుమ్ములకు స్ఖలనం, భావప్రాప్తికి ఏంటి సంబంధం అనేది కూడా చర్చకు వచ్చింది. కానీ, ఆటోనోమిక్ నెర్వస్ సిస్టమ్ లోని నరాలలోని చర్య ద్వారా ఇలాంటి భావన కలగవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కామోధ్రేకం కలిగిన సమయాల్లో కూడా ఇలానే తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
sneezing

ఎందుకు ఇలా జరుగుతుందో ఇంకా తమకు తెలియదని చెవులు, ముక్కు, గొంతు సర్జన్ Dr. Mahmood Bhutta చెబుతున్నారు. దీనిపై తాము అధ్యయనం కూడా చేశామని చెప్పారు. మెదడులో కేంద్ర నాడీ వ్యవస్థలో జరిగే గందరగోళంతో ఇలా ఆటోమాటిక్ గా తుమ్ములు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించినట్టు తెలిపారు.

5. కాళ్లలో వణుకు వస్తుంది:
శృంగారంలో భావప్రాప్తి కలిగిన సమయంలో చాలామంది మహిళల్లో ఇలాంటి సమస్య కనిపిస్తుంటుంది. కండరాల చుట్టూ ఏర్పడిన ఒత్తిడి కారణంగా భావప్రాప్తి కలిగినప్పుడు కాళ్లలో ఒక్కసారిగా వణుకు రావొచ్చు. అది కూడా జననేంద్రియ ప్రాంతంలో కాదు. శృంగారం పూర్తి కాగానే వారిలోని ఒత్తిడంతా ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది.
leg shake
కొంత తిమ్మిరిలు, వణుకు లేదా సంకోచాలు కనిపిస్తాయి. మీలోనూ ఇలానే జరిగితే.. నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి. పొటాషియంతో కూడిన ఆహారాన్ని ఏదైనా తినండి.. అరటిపండు, అవకాడో లేదా యంగుర్ట్ వంటివి తీసుకోండి. ఒకవేళ మీ కాళ్లు వణుకుతుంటే.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని OB/GYN Jessica Williams సూచించారు.

6. జ్వరం వచ్చినట్టుగా అనిపించడం :
శృంగారంతో భావప్రాప్తి కలిగిన వెంటనే మీలో Post-orgasmic illness syndrome (POIS) అనే చర్య అరుదుగా జరుగుతుంది. పురుషుల్లోనే ఇది ఎక్కువగా అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అలానే స్ఖలనం తర్వాత అనిపిస్తుంది. అలసట, ముక్కు దెబ్బడ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. POIS చర్యకు కారణం ఏంటో కచ్చితంగా తెలియదు. కానీ, కొందరు పరిశోధకులు మాత్రం.. Genetic and Rare Diseases Information Center ప్రకారం.. Auto immune disorder లేదా వీర్యంలో అలర్జీ కారణంగా ఇలా జరుగుతుందని అంటున్నారు.
sneezing

Tulane University నుంచి ఓ రీసెర్చ్ రివ్యూ ప్రకారం.. POIS అనేది లైంగిక జీవితాన్ని పరిమితం చేసేలా వారిలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. కామోద్రేకం దూరం చేసే అంతర్గత సమస్యలను ప్రేరేపిస్తుందని తెలిపింది. శృంగారంలో స్ఖలనం తర్వాత మీలో జ్వరం మాదిరి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాడమే మంచిందని International Society of Sexual Medicine సిఫార్సు చేస్తోంది.