జీర్ణక్రియను మెరుగుపరిచే 7 అద్భుతమైన ఆహారాలు ఇవే!

జీర్ణక్రియను మెరుగుపరిచే 7 అద్భుతమైన ఆహారాలు ఇవే!

మనం ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలంటే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి.  జీర్ణవ్యవస్థ మంచిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మనం తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు కడుపునోపి, వికారం మరియు వాంతులకు దారి తీస్తుంది.



జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఆహారాలు:
1. గోధుమ:
సాధారణంగా అన్నీ కుటుంబాలకు గోధుమ ప్రధానమైన ఆహారం. ఇందులో చాలా పోషకాలకు, ఆహార ఫైబర్ లకు మూలం. మీ శరీరానికి రోజుకు కనీసం 25 గ్రాముల ఫైబర్ అవసరం. గోధుమలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సులువుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

https://10tv.in/scientists-discover-tiny-antibody-that-completely-neutralises-novel-coronavirus/

2. బచ్చలికూర: 
బచ్చలికూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బచ్చలికూరలో A, C, E, K, B విటమిన్లు ఉంటాయి. అంతేకాదు బచ్చలికూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది మరియు అదనపు కొవ్వు శరీరంలో నిల్వ చేయబడదు. గర్భిణీ స్త్రీకి గర్భధారణ సమయంలో తల్లి మరియు పిల్లలకు అవసరమైన అన్ని పోషకాలను ఇస్తుంది. ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ఇనుము శరీరంలోని రక్తహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది.



3. బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ C మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అజీర్తి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణం కానీ ఆహారాలను జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది.
4. చేప నూనె:
చేప నూనె పేగులలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ A, D పుష్కలంగా ఉండి జీర్ణక్రియను హెల్తీగా మార్చుతుంది. అన్ని రకాల జీర్ణసంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. అజీర్తిని అరికట్టుటలో ఇది చాలా ఉపయోగపడుతోంది.



5. పండ్లు:
పండ్లలో ముఖ్యంగా సిట్రస్ పండ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. వాటిలో అధికంగా ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ జీర్ణక్రియను మరింత మెరుగుపరిచేందుకు సహాయపడుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇంకా పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అలసటను మరియు నీరసాన్ని తగ్గిస్తుంది.
6. పెరుగు:
పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతోంది. పొట్టకు సంబంధించిన ఎటువంటి జీర్ణ సమస్యలనైనా చాలా సులభం నయంచేసే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. మీరు ఇతర పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు  ఎక్కువగా పెరుగు తినమని డాక్టర్స్ సలహాలిస్తుంటారు.



7. ఓట్స్:
ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో వివిధ రకాల మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఓట్స్ చాలా మంచిది. అంతే కాదు పొట్ట ఆరోగ్యం, మలబద్దకాన్నినివారించడంలో సహాయపడుతుంది.