ఈ 8 అలవాట్లు ఉంటే.. మీరే స్ట్రాంగ్ పర్సన్!

  • Published By: sreehari ,Published On : December 16, 2019 / 01:52 PM IST
ఈ 8 అలవాట్లు ఉంటే.. మీరే స్ట్రాంగ్ పర్సన్!

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీరే స్ట్రాంగ్ పర్సన్. మానసికంగా ధృఢంగా ఉండేవారి లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఎలాంటి కఠిన పరిస్థితులోనైనా మానసిక స్థైర్యంతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవంగా.. మానసికంగా దృఢంగా ఉండటం సాధ్యమేనా? అన్ని సందర్భాల్లో నిబ్బరంగా ధైర్యంగా ఉండటం కుదురుందా? అంటే.. అందరికి సాధ్యపడే విషయం కాదనే చెప్పాలి. ప్రయత్నిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎదుర్కొనే ప్రయత్నంలో ఒక వ్యక్తిలో కలిగే కోపం, భయం, ఆందోళన, కలవరం, నిరాశ నిస్రృహకు లోనవుతుంటారు.

కొంతమంది పాజిటీవ్ ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొంతమంది ప్రతిదానికి నెగటీవ్ ఆలోచనలతో ఆందోళన చెందడం, మానసికంగా కృంగిపోతుంటారు. ప్రతికూల ఆలోచనలను పూర్తిగా మనస్సు నుంచి దూరం చేయడం సాధ్యం కానిపని. అయినప్పటికీ కొంతమంది ఇతరులు కంటే తమ ఆలోచన విధానం ఎలా ఉంది? తమ ఎమోషన్స్ ఏంటి? అనేదానిపై క్లారిటీ ఉంటుంది.

వాటికి తగినట్టుగా తమ ఆలోచనలకు పదును పెడుతుంటారు. మన జీవితంలో కూడా అదే ఆలోచన విధానాన్ని అవలంభిస్తే.. అన్ని అద్భుతాలే చేయొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. అలాంటి మానసికంగా దృఢంగా కనిపించేవారిలోని 8 అద్భుతమైన అలవాట్లు ఏంటో ఓసారి తెలుసుకుందాం రండి.

1. సమస్యలపై చింతించరు.. ఆలోచించరు :
మానసికంగా దృఢంగా ఉండేవారిలో ప్రధానమైన అలవాటు ఒకటి.. సమస్యలపై చింతించరు.. పదేపదే ఆలోచించరు. ఏదైనా సమస్య వస్తే.. దాన్ని పరిష్కారంపైనే దృష్టిపెడతారు. అయ్యో ఇలా అయింది అని బాధపడుతూ కూర్చోరు. అదే సమస్యను గంటలకొద్ది ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయరు. తక్షణమే దాన్ని పరిషర్కించి రిలీఫ్ అయిపోతారు.

2. ఇతరుల పనులతో తమపై కోపగించుకోరు :
ప్రపంచంలో తగినంత సమయం హాయిగా గడిపేయండి. మీరు చేయని పనులను ఎవరైనా చేస్తే.. తప్పుగా డ్రైవింగ్ చేయడం, చెడుగా మాట్లాడటం లేదా చెడుగా ప్రవర్తించినట్టు చూస్తే వారిపై వెంటనే రియాక్ట్ అవుతారు. ఎవరైనా ట్రాఫిక్ క్రాస్ చేస్తే వారిని చూసి తిట్టుకుంటాం. కానీ, ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది.

అలా వెళ్లేవారికో ప్రతి సమస్య ఉండొచ్చు. ఒకవేళ వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వెళ్తుండొచ్చు.. ప్రసవ వేదనతో ఉండొచ్చు.. ఎవరైనా చావుబతుకుల్లో ఉండొచ్చు. అదే.. మానసికంగా దృఢంగా ఉండేవారు మీ స్థానంలో ఉంటే.. ఇలాంటి పరిస్థితిని చూసి తమను తాము కోపగించుకోరు.

3. ప్రాక్టీసుతో విల్ పవర్‌కు పదును :
చెడు విషయాలు కావొచ్చు.. లేదా మంచి విషయాలకు కావొచ్చు.. ప్రతి మనిషి కంగారుపడటం కామన్. ఉపవాసం, వ్యాయామం లేదా నిర్దిష్ట పరిస్థితులకు దూరంగా ఉండటం ఏదైనా కావొచ్చు.. అదే మానసికంగా దృఢంగా ఉండేవారు అయితే పరిస్థితులను అర్థం చేసుకుంటారు. తమ మనస్సులో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి విజయం సాధిస్తారు.

4. స్నేహితుల ఎంపికలో జాగ్రత్త :
మానసికంగా దృఢంగా ఉండేవారంతా స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎవరితో చెలిమి చేయాలో ఎవరికి దూరంగా ఉండాలో వారికి ఒక క్లారిటీ ఉంటుంది. వివాదాలకు కారణమయ్యే వారిని దూరం పెడతారు. డ్రామాలు ప్లే చేసేవారు లేదా మరొకరిపై నెగటీవ్ పై మాట్లాడేవారిని దగ్గరకు రానివ్వరు. అలాంటి వారంతా ఒక వ్యక్తి మన:శాంతిని నాశనం చేస్తారని వీరికి బాగా తెలుసు.

5. ఔధార్యాన్ని ప్రదర్శిస్తారు :
పిసినారితనంగా ఉండేవారిలో ఏదో రకమైన భయం ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు. ప్రతిదానికి ఎక్కువగా స్పందిస్తుంటారు. కంగారుపడుతుంటారు. వారు సంతోషంగా ఉండరు.. ఇతరులను మన:శాంతిగా ఉండనివ్వరు. మానసికంగా దృఢంగా ఉండేవారు అయితే తమకు లేని విషయాల్లో ఆందోళన చెందరు. తమను తాము నమ్ముకుంటారు. తమ భవిష్యత్తు మరింత సెక్యూర్ గా ఉంటుందని తమకు బాగా తెలుసునని విశ్వసిస్తారు.

6. సానుభూతిలో మంచివారు : 
మరో మాటలో చెప్పాలంటే, వారు మానసికంగా ఎంతో తెలివిగలవారు. ఎవరు ఎందుకిలా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తిస్తున్నారో గుర్తించడంలో సమర్థులు. ఉదాహరణకు.. మానసికంగా దృఢంగా ఉండే వారంతా వ్యక్తిగతంగా ఒక్కొక్కరి సామర్థ్యాలను ఉదాహరణకు, మానసికంగా బలమైన వ్యక్తులు నిజంగా వారి విలువను ధృవీకరించడానికి ఇతరులను వెతుకుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా కొందరు భావోద్వేగాలతో వ్యవహరించ లేనప్పుడు తమ సొంత స్పందనకు తగినట్టుగా వ్యవహరిస్తుంటారు.

7. ఆహారం.. శరీరాకృతిపై జాగ్రత్తలు :
మీరు శారీరకంగా ఎలా భావిస్తారో ఖచ్చితంగా మీరు మానసికంగా ఎలా భావిస్తారో ప్రభావితం చేస్తుంది. మానసికంగా బలమైన వ్యక్తులు రోజువారీ వ్యాయామం చేసే అలవాటు కలిగి ఉంటారు, అతిగా తినే అవకాశం లేదు. ఆహారపు అలవాట్లలోనూ ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు. 

8. కక్ష సాధించరు.. క్షమించే గుణం ఎక్కువ :
చాలామంది తమ జీవితంలో ఎవరైనా తమను బాధ పెట్టడం చూసి కుంగిపోతారు. అదేపనిగా బాధపడిపోతుంటారు. బాధ అనేది ఒక వ్యాధిలా ముదిరిపోయి తమ సామర్థ్యాలపై విశ్వాసం కోల్పోతారు. సంతోషంగా ఉండలేరు. భయాందోళనకు గురవుతుంటారు. అదే.. మానసికంగా దృఢంగా ఉండేవారు అయితే బాధకు కారణమైనవారిని అర్థం చేసుకుంటారు. వారు చేసిన పనిని క్షమిస్తారు. అంతేకానీ, వారిపై కక్ష సాధించే ప్రయత్నం చేయరు. క్షమాపణతోనే స్వేచ్ఛ వస్తుందని బలంగా విశ్వసిస్తారు.