కరోనా నుంచి కోలుకున్న తర్వాత వేధించే కొత్త సమస్య ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’

  • Published By: nagamani ,Published On : May 23, 2020 / 06:01 AM IST
కరోనా నుంచి కోలుకున్న తర్వాత వేధించే కొత్త సమస్య ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’

కరోనా బారినపడి కోలుకున్నవారు అబ్బా..చావు అంచులదాకా వెళ్లి బైటపడ్డాం రా బాబూ..అని ఊపిరి తీసుకనే లోపు మరో సమస్యలకు గురవుతున్నారని ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా’ వైద్యులు గుర్తించారు. కరోనా తరువాత కోలుకున్నవారిని మెడనొప్పి విపరీతంగా.. వేధిస్తున్నట్టు ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా’ వైద్యులు గుర్తించారు. 

ఇలా మెడనొప్పి రావడాన్ని ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’గా అంటారని డాక్టర్లు చెప్పారు. కరోనాకు గురై తరువాత కోలుకున్న ఓ యువతిలో డాక్టర్లు ఈ లక్షణాలను గుర్తించారు. కరోనా వచ్చిన ఆమె చికిత్స తరువాత డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన ఆమె తీవ్రమైన మెడనొప్పితోపాటు థైరాయిడ్ గ్రంథి వద్ద కూడా నొప్పితో బాధపడిందనీ..దీనితో పాటు జ్వరం కూడా రావడంతో ఆమె  కరోనా మరోసారి వచ్చిందనే భయంతో మరోమారు ఆసుపత్రికి వెళ్లింది.

యువతిని పరీక్షించిన వైద్యులు ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినవారిలో ఇటువంటి సమస్యలు సహజమని  సీనియర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో లాట్రోఫా తెలిపారు. వారు కోలుకున్నప్పటికీ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ (వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వచ్చే ప్రతిచర్యలాంటిది) కారణంగా ఇటువంటి సమస్యలు వస్తుంటాయని తెలిపారు.

కోవిడ్ వైరస్ కారకమైన సార్స్ కోవ్2 కారణంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్ లాట్రోఫా పేర్కొన్నారు.