రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి, యోగా డే సందర్భంగా కృష్ణంరాజు సూచనలు

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 08:26 AM IST
రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి, యోగా డే సందర్భంగా కృష్ణంరాజు సూచనలు

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో ఉంది. యోగా అనేది భారతీయుల జీవనంలో ఓ భాగం. ఈ ఆసనాల గొప్పదనం తెలిసే చాలామంది విదేశీయులు సైతం వీటిని పాటిస్తున్నారు. జూన్ 21న ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రాణ క్రియతో రోగ నిరోధక శక్తి:
యోగా డే సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. యోగా ద్వారా జీవితాల్లో మనశ్శాంతి లభిస్తుందన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుం కరోనా మహమ్మారి భయపెడుతున్న తరుణంలో అందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలానో కృష్ణంరాజు తెలిపారు. యోగాలో ఒక భాగమైన ”ప్రాణ క్రియ” ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

యోగాతో డిప్రెషన్ దూరం:
కుంగుబాటు నుంచి బయటపడాలంటే వారానికోసారి తప్పనిసరిగా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగా వల్ల కుంగుబాటు లక్షణాలు తగ్గుతున్నాయనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించామని, అందువల్ల ఇతరులు సైతం తమ ఆరోగ్య సంరక్షణకు యోగాను ఆచరించే అవకాశం ఉందన్నారు.

1

శరీర అందంతో పాటు మనస్సును అదుపులో ఉంచుతుంది:
వాస్తవానికి యోగా అనేది పూరాతమైన చికిత్స ప్రక్రియ. కానీ కాలక్రమేణా యోగాను విస్మరించడం వల్ల అది మరుగునపడిపోయింది. ఇటీవల కాలంలో యోగాను ప్రాముఖ్యత పెరగడం.. ప్రపంచ దేశాలు సైత ఆచరిస్తుండడంతో తిరిగి యోగాకు పునర్వైభవం దక్కింది. అయితే ఇంకా చాలామంది యోగాను కేవలం శరీర అందానికి పనికొచ్చే విషయంగానే చూస్తున్నారు. కానీ ఇది నిజానికి శరీర అందంతో పాటు మనస్సును అదుపులో ఉంచుతుంది.

మానసిక వ్యథకు దివ్య ఔషధం యోగా:
సాధారణంగా కొన్ని వ్యాధులకు మానసిక వ్యథ కారణం. అయితే మానసిక వ్యథ అనేదాన్ని నయం చేసేందుకు మెడిసిన్ కంటే యోగా ప్రక్రియ అత్యుత్తమం. నిత్యం యోగాను ఆచరించడం వల్ల మనస్సు, శరీరం రెండూ అదుపులో ఉంటాయి. ఫలితంగా అనేక వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ విషయాన్నిఇటీవల కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు.

Read: ప్రతి ఏడాదిలో ఫాదర్స్‌డే.. జూన్ 3 ఆదివారం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?