After Food : భోజనం తర్వాత ఓ గంట వరకు ఈ పనులు అస్సలు చేయొద్దు

భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఏమేం చేయకూడదో తెలుసుకుందాం..

After Food : భోజనం తర్వాత ఓ గంట వరకు ఈ పనులు అస్సలు చేయొద్దు

After Food

After Food : ప్రస్తుతం అందరిదీ బిజీ లైఫ్. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మనిషి రోబోలా తయారయ్యాడు. మరీ ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో. ఈ క్రమంలో అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. అవి.. అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. చాలామంది భోజనం చేసిన వెంటనే కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అలాంటి పనులతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలో భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఏమేం చేయకూడదో తెలుసుకుందాం..

* చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్‌, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
* అన్నం తిన్నాక ఏవైనా పండ్లు తినడం మీకు అలవాటా? ఇదీ తప్పే అంటున్నారు. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వల్ల ఆ పోషకాల్ని కోల్పోతాం. కాబట్టి పండ్లను తినాలనిపిస్తే భోజనం తర్వాత గంటకి తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* ఇక భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. అది కూడా తప్పేనట. ఇలా చేస్తే బరువు పెరుగుతారు.
* ఇక తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకండి. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.