ఫైజర్ కరోనా టీకా.. 10 నిమిషాల్లో తీవ్రమైన అలర్జీ రియాక్షన్..!

ఫైజర్ కరోనా టీకా.. 10 నిమిషాల్లో తీవ్రమైన అలర్జీ రియాక్షన్..!

Pfizer’s coronavirus Vaccine anaphylactic  Reaction: ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహ్మారిని అంతంచేసే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి . అయితే ఈ కరోనా వ్యాక్సిన్లలో ఏది సురక్షితమో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయోమన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. అలస్కాలో Centers for Disease Control and Prevention’s (CDC) ఆమోదం పొందిన ఫైజర్ వ్యాక్సిన్‌ను ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్లను వేస్తున్నారు.

జ్యునెయూలోని బార్ట్ లెట్ రిజనల్ ఆస్పత్రిలో ఫైజర్ కరోనా టీకా వేయించుకున్న ఒక హెల్త్ కేర్ వర్కర్ కు తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వచ్చింది. టీకా వేయించుకున్న 10 నిమిషాల్లోనే వ్యాక్సిన్ వేసిన చోట ఎర్రగా మారింది. ఇతర అలర్జీ లక్షణాలు కూడా కనిపించాయని అన్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ తీవ్ర దుష్ర్పభావాల కారణంగా మహిళా హెల్త్ కేర్ వర్కర్ ఆస్పత్రిలో ఐసీయూలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

వాస్తవానికి ఈమెకు ఎలాంటి అలర్జీ సమస్యలు లేవని అలస్కా ఆరోగ్య, సామాజిక సేవా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఇలా అలర్జిక్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇదొకటి మాత్రమేనని సీడీసీ ఇన్ఫెక్షిసియస్ డిసీజెస్ డిప్యూటీ డైరెక్టర్ జే బట్లర్ వెల్లడించారు.

దేశంలో ఎక్కడా కూడా వ్యాక్సిన్ తరహా అలర్జీ రియాక్షన్ లేవని బట్లర్ స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ డేటాను పరిశీలించామన్నారు. న్యూయార్క్, మిచిగాన్, ఇడాహోలో వేలాది మంది అమెరికన్లు ఫైజర్ కరోనా టీకా వేయించుకున్నారని వారిలో ఇలాంటి అలర్జీ లక్షణాలు లేవని తెలిపారు. గ్రేట్ బ్రిటన్ లో ఫైజర్ టీకా వేయించుకున్న ఇద్దరు హెల్త్ కేర్ వర్కర్లలో anaphylactic లాంటి అలర్జీ రియాక్షన్ తో తీవ్రంగా బాధపడ్డారని పేర్కొన్నారు.

వారిద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. వీరికి ఫైజర్ బయోంటెక్ SE వ్యాక్సిన్ గతవారమే ఇచ్చారు. రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో వందలాది మంది అమెరికన్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో టీకా వేయించుకున్న వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేయనున్నట్టు బట్లర్ తెలిపారు.

ఫైజర్ మొదటి డోస్ వేయించుకున్న మహిళా హెల్త్ కేర్ వర్కర్.. రెండో మోతాదు తీసుకోవాలంటే భయాందోళనకు గురవుతోందని వైద్యాధికారులు తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో దాదాపు 40వేల మంది టీకా వేయించుకున్న వారిలో ఎవరికి ఇలాంటి అలర్జీ లక్షణాలు లేవని అలెస్కా చీఫ్ మెడికల్ అధికారి అన్నె జింక్ పేర్కొన్నారు.