KFC మీల్‌లో 500, కబాబ్‌లో 1,100, మరి డొమినోస్ పిజ్జాలో 2,000 కేలరీలు.. మీరు తినే ఫాస్ట్‌ఫుడ్‌లో ఎన్ని కేలరీలో తెలుసా?

  • Published By: sreehari ,Published On : February 29, 2020 / 10:45 AM IST
KFC మీల్‌లో 500, కబాబ్‌లో 1,100, మరి డొమినోస్ పిజ్జాలో 2,000 కేలరీలు.. మీరు తినే ఫాస్ట్‌ఫుడ్‌లో ఎన్ని కేలరీలో తెలుసా?

ఫాస్ట్ ఫుడ్ కల్చర్.. ఇప్పుడిదే ట్రెండ్. ఇంట్లో వండిన ఫుడ్ తినే రోజులు పోయాయి. అంతా ఫాస్ట్ ఫుడ్‌లకు బాగా అలవాటుడిపోతున్నారు. ఇలా ఆర్డర్ చేస్తే అలా క్షణాల్లో ముందుండే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ (పిజ్జా, బర్గర్, కబాబ్) కనిపిస్తే చాలు.. లొట్టలేసుకుని తినేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడా చూసిన ‘టేక్ అవే’ ఫుడ్ కౌంటర్ల కల్చర్ పెరిగిపోతోంది.

విదేశీ కల్చర్ నుంచి పక్కదేశాలకు పాకిన ఈ పాశ్యాత్య ఫుడ్ కల్చర్ మనుషుల్లో సోమరితనాన్ని పెంచుతోంది. జంక్ ఫుడ్.. ఈ పేరు వింటనే చాలు.. టేక్ అవే ప్రియుల నోటిలో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని ఒకవైపు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ అలవాటుపడ్డ ప్రాణాలు జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నారు. 

మీరు తినే ఫుడ్‌ ఎన్ని కేలరీలో తెలుసా?:
ఇప్పుడు BBC documentary వెల్లడించిన డేటాను చూస్తే.. టేక్ అవే ప్రియులంతా జంక్ ఫుడ్ తినడం మానేయాల్సిందే.. ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు వెలిశాయి. ప్రతి రెస్టారెంట్లలో జంక్ ఫుడ్ కోసం ప్రత్యేకంగా టేక్ అవే కౌంటర్లు వెలిశాయి.. టేక్ అవే ప్రియుల్లో ఎక్కువమంది ఇలాంటి రెస్టారెంట్లలోనే ఫుడ్ కొని తినేస్తుంటారు.

మీరు ఇష్టంగా తినే కొన్ని ఫావరేట్ రెస్టారెంట్లలో లభించే జంక్ ఫుడ్ లో ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా? అయితే BBC documentary డేటాను ఓసారి చూస్తే షాక్ అవుతారు.. అవును.. డొమినోస్ పిజ్జాలో 2వేల కేలరీలు, KFC మీల్‌లో 500 కేలరీలు, కెబాబ్‌లో 1,100 కేలరీలు ఉంటాయని తేలింది. బీబీసీకి చెందిన ఓ నిక్కీ ఫాక్స్ అనే జర్నలిస్టు టేక్ అవే ఫుడ్ నుంచి ఎంత మోతాదులో కేలరీలు మన శరీరంలోకి చేరుతున్నాయని అనేదానిపై డాక్యుమెంటరీలో చూపించే ప్రయత్నం చేశారు. 

రోజు 2 టేక్ అవేలు.. 14 రోజుల డైట్ :
ఫాస్ట్ ఫుడ్‌కు సంబంధించి రీసెర్చర్లు ఏమని హెచ్చరిస్తున్నారో నిక్కీ వారితో కలిసి రీసెర్చ్‌లో పాల్గొన్నారు. LiverPool John Moores University, Imperial college Londonకు చెందిన రీసెర్చర్లతో కలిసి లోతుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయానికి సంబంధించి 15 మంది వాలంటీర్లను ప్రతిరోజు రెండు టేక్ అవేలను 14 రోజుల పాటు తినమని సూచించారు. అందులో చేపలు, చిప్స్, పిజ్జా, భారతీయ, చైనీస్ వంటకాలు ఉండేలా చూశారు.

తినడం ఆపేసిన తర్వాత రీసెర్చ్ లో పాల్గొన్న వారిందరిని వైద్యపరీక్షలు చేయించారు. వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్, బ్యాక్టిరీయాను నివారించే బాడీ ఫ్యాట్, మానసిక సంబంధమైన అనేక పరీక్షలు చేయించారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎక్కువమందికి నిద్రలేమి, నిదానంగా, రోజువారీ పనుల్లో ఏకాగ్రత చూపలేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. టేక్ అవే భారీ డైట్ ప్రభావం చాలామంది వాలంటీర్లలో ఎక్కువగా బరువు పెరగడానికి కారణమైందని గుర్తించారు. 

* KFC స్నాక్ బాక్స్ : Fat 20 గ్రాములు, 475 కేలరీలు
* McDonald’s Big Mac, మీడియం fries : ఫ్యాట్ 39 గ్రామలు, 780 కేలరీలు
* Fish and chips: Fat 45గ్రాములు, 927 కేలరీలు
* Doner kebab : Fat 60 గ్రాములు, 1,100 కేలరీలు
* చికెన్ కూర్మా, రైస్, చపాతి : Fat 83 గ్రాములు, 1,810 కేలరీలు
* Large Dominoలో క్రస్ట్ పిజ్జా  : Fat 80 గ్రాములు, 1,984 కేలరీలు