Antibodies ఉన్నంత మాత్రానా… COVID-19 నుంచి తప్పించుకుంటారన్న గ్యారంటీ లేదు..

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 08:04 PM IST
Antibodies ఉన్నంత మాత్రానా… COVID-19 నుంచి తప్పించుకుంటారన్న గ్యారంటీ లేదు..

Antibodies May Not Guarantee Protection From COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్ తయారవుతాయి.. అయితే ఈ యాంటీబాడీలతో లైఫ్ లాంగ్ కరోనా రాదనడానికి గ్యారెంటీ లేదంటున్నారు సైంటిస్టులు.. కరోనా రోగుల్లో యాంటీబాడీలు తయారైన తర్వాత అవి శరీరంలో ఎన్ని నెలలు ఎంతకాలం ఉంటాయి? అంటే కచ్చితంగా చెప్పలేమంటున్నారు.



కరోనా నుంచి కోలుకున్నాక సాధారణంగా పేషెంట్లలో యాంటీబాడీలు తయారవుతాయి.. ఈ యాంటీబాడీల నుంచి మరోసారి కరోనా సోకకుండా ప్రొటెక్షన్ ఇస్తాయన్న గ్యారెంటీ లేదని సైంటిస్టులు తేల్చేశారు. భారతదేశంలో COVID-19 తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే 42 లక్షల మార్కును దాటబోతోంది. సోమవారం నాటికి దేశంలో 90,062 కరోనా కేసులకు చేరాయి.

యాంటీబాడీలతో కరోనా మళ్లీ రాకుండా రక్షించగలవా? అనేదానిపై సైంటిస్టులు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై వారిలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు.. ఏ స్థాయిలో యాంటీబాడీలు పనిచేస్తాయో చెప్పలేమని ఇమ్యునాలజిస్ట్ సత్యజిత్ రాత్ చెప్పారు.



యాంటీబాడీలతో వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో నిర్ధారించలేమని న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (NII)సైంటిస్టు ఒకరు చెప్పారు. యాంటీబాడీలు (nAbs) సాధారణ యాంటీబాడీలు ఉంటాయి. కరోనావైరస్‌ నివారణగా అభివృద్ధి చేసిన nAbs హోస్ట్ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించగలవు.

ఇతర యాంటీబాడీలు వైరస్ నిరోధకత కోసం ఉత్పత్తి అవుతాయి. ప్లాస్మా థెరపీపై కూడా సైంటిస్టుల్లో ఏకాభిప్రాయం లేదని గుర్తించారు. దేశంలో వాస్తవంగా కరోనా కేసుల సంఖ్యను గుర్తించే లక్ష్యంతో గత కొన్ని నెలలుగా భారతదేశంలో వివిధ సెరో-సర్వే టెస్టులు నిర్వహిస్తున్నారు.



కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు తయారయ్యాయో లేదో రక్తాన్ని పరీక్షించడం ద్వారా నిర్ధారించే అవకాశం ఉంది. కరోనా కేసులు వాస్తవానికి నివేదించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయని సర్వేలు సూచిస్తున్నాయి.