Onions Helpful : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయకారిగా పనిచేసే ఉల్లిపాయలు?

సాధార‌ణంగా మ‌నం నిత్యం వంట‌ల్లో ఉల్లిపాయలు వాడుతాం.  అయితే వీటికి శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్స్ అన‌బ‌డే పాలిఫినాలిక్ స‌మ్మేళ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి.

Onions Helpful : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయకారిగా పనిచేసే ఉల్లిపాయలు?

onions helpful

Onions Helpful : ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ మ‌న ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే నాళాలు ఇరుకుగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గుండె అనారోగ్యం బారిన ప‌డుతుంది. దీని వల్ల గుండె జ‌బ్బుల ప్రమాదం పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ప‌లు సూప‌ర్ ఫుడ్స్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

సాధార‌ణంగా మ‌నం నిత్యం వంట‌ల్లో ఉల్లిపాయలు వాడుతాం.  అయితే వీటికి శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్స్ అన‌బ‌డే పాలిఫినాలిక్ స‌మ్మేళ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కణాల పెరుగుదలను ఆపగల సామర్థ్యం, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో ఉల్లిపాయలు సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఒక అధ్యయనంలో ఉల్లిపాయలలోని ఫ్లేవనాయిడ్లు తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్‌ను ఊబకాయం కలిగిన వ్యక్తులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించినట్లు నిర్ధారించారు. దీనికి ఉల్లిపాయల్లోని ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కారణమని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఉల్లిపాయ‌ల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ మ‌న శ‌రీరంలో ఉండే లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్ )అనే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయ‌ని పరిశోధనలు చెబుతున్నాయి. ఎల్‌డీఎల్ శ‌రీరంలో ఎక్కువ‌గా పేరుకుపోతే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఉల్లిపాయ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల శరీరంలో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను మ‌నం స‌లాడ్లు, శాండ్ విచ్‌లు, ఇత‌ర ఆహారాల్లో తిన‌వ‌చ్చు.