Covid-19 రోగనిరోధకతను పెంచే ఆయుర్వేదిక్ Fifatrol డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్‌కు BHU ప్లానింగ్!

Covid-19 రోగనిరోధకతను పెంచే ఆయుర్వేదిక్ Fifatrol డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్‌కు BHU ప్లానింగ్!

కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ కూడా జరిగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కరోనా చికిత్సకు ఇతర వ్యాధులకు ఇచ్చే డ్రగ్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ నిర్మూలించే సమర్థవంతమైన వ్యాక్సీన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. Banaras Hindu University (BHU)కు చెందిన ప్రొఫెసర్లు.. కరోనా వైరస్‌ను నిరోధించాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా ఉండాలి. అందుకే.. ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఔషధం (Fifatrol)పై క్లినికల్ ట్రయల్స్ కోసం BHU ప్లానింగ్ చేస్తోంది.

దీనికి సంబంధించి BHU ప్రొఫెసర్లు ప్రతిపాదించగా.. ఇంకా ఆమోదించాల్సి ఉంది. BHU ప్రొఫెసర్, ప్రిన్సిపల్ విచారణ అధికారి క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రతిపాదించినట్టు ప్రాజెక్ట్ వైద్యులు KN Dwivedi న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఈ ప్లాన్‌కు సంబంధించి ప్రతిపాదనను ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కు పంపినట్టు చెప్పారు. covid-19 నిర్మూలించేందుకు రీసెర్చ్ సంస్థల ద్వారా ఆయుర్వేద శాస్త్రీయ ధ్రువీకరణ, సాంప్రదాయ ఔషధ ఫార్మూలపై టాస్క్ ఫోర్స్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది.

Interdisciplinary AYUSH Research, Development Task Force లోని సభ్యులు Department of Biotechnology (DBT), Council of Scientific Industrial Research (CSIR)తో పాటు ఆయూష్ ప్రాక్టిషనర్స్, ఇతరులు కూడా ఉన్నారు. COVID-19 చికిత్సకు వివిధ దశలలో ఆయుష్ వ్యవస్థల నుంచి పొటెన్షియల్ ప్రివెంటివ్ థెరపీ, థెరపిటిక్ చికిత్సా విధానాలను గుర్తించడమే టాస్క్ ఫోర్స్ సభ్యుల పనిగా ఉంటుంది. మార్చి 31న ఆయూష్ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఆయుర్వేద, యోగ, నేచరోపతి, ఉనాని, సిద్ధా, హోమియోపతి (AYUSH)ప్రాక్టిషనర్లు, ఔషధ సంస్థలను వివిధ థెరపీలపై సూచనలు కోరింది.
ayurvedic

నోటిఫికేషన్ సూచన మేరకు ఆయా సంస్థల నుంచి 2వేల వరకు ప్రతిపాదనలు అందాయి. fifatrol డ్రగ్‌పై నిపుణులు ఏమంటున్నారంటే.. హెర్బల్ చికిత్సలో ఈ ఔషధానికి రోగనిరోధకతను పెంచగల సామర్థం ఉంది. ప్రధాన బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేయగలదని ఇదివరకే నిరూపితమైంది. జ్వరం, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులను వ్యాప్తిచేసే staphylococcus వంటి జాతి కుటుంబానికి చెందిన బ్యాక్టిరియాలపై కూడా fifatrol డ్రగ్‌ బాగా పనిచేస్తుందని అంటున్నారు.

Fifatrol అనే ఔషధంతో జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, పైభాగంలో శ్వాసకోశ వ్యాధులకు చికిత్స అందించవచ్చు. కొత్త కరోనా వైరస్ పై పోరాడేందుకు ఈ డ్రగ్ కూడా పనిచేస్తుందని మొదటిసారి నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చారు.  BHUలోని Department of Dravyaguna ఉన్నతాధికారి డాక్టర్ ద్వివేది మాట్లాడుతూ.. కొవిడ్ మాదిరిగా ఒకే రకమైన లక్షణాలు ఉన్న బాధితులకు ఈ డ్రగ్ Fifatrol ఇచ్చినట్టు తెలిపారు.

అందుకే ఈ ఔషధాన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తద్వారా కరోనా మరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన మీడియాకు వెల్లడించారు. భూపాల్ లోని AIIMS లో చికిత్స పొందే డెంగ్యూ రోగులకు ట్రయల్ సమయంలో Fifatrol డ్రగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ప్లేట్ లేట్స్ పెరిగినట్టు గుర్తించామని తెలిపారు. అంతేకాదు.. ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కాలేయ సామర్థ్యం పెరగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రొఫెసర్ స్పష్టం చేశారు.