N95 Mask : ఎన్‌95 మాస్కులను ఉతకొచ్చా? ఎన్నిసార్లు వాడాలి? ఎవరెవరు వాడాలి?

అయితే మాస్కు విషయంలో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఎన్95 మాస్కులను ఉతకొచ్చా? అనేది ఒక సందేహం. ఎన్‌95 మాస్కు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? అనే సందేహం అందరిలోనూ ఉంది. దీనికి నిపుణులు ఏమంటున్నారంటే..

N95 Mask : ఎన్‌95 మాస్కులను ఉతకొచ్చా? ఎన్నిసార్లు వాడాలి? ఎవరెవరు వాడాలి?

N95 Mask

N95 Mask : కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే భౌతిక దూరం పాటించ‌డం, ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, టీకాలు వేసుకోవ‌డం మాత్ర‌మే మార్గ‌ం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. అయితే మాస్కు విషయంలో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఎన్95 మాస్కులను ఉతకొచ్చా? అనేది ఒక సందేహం. ఎన్‌95 మాస్కు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? అనే సందేహం అందరిలోనూ ఉంది. దీనికి నిపుణులు ఏమంటున్నారంటే..



ఎన్‌95 మాస్కులు కొవిడ్‌-19 కారక వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే మాట నిజమే. కానీ, వీటిని ఉతికి, తిరిగి వాడుకోవటం తగదని డాక్టర్లు చెబుతున్నారు. సబ్బుతో, నీటితో, వైద్య అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్‌తో దేనితో శుభ్రం చేసినా వీటి వడపోత సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుందన్నారు. అప్పుడు ధరించినా ఉపయోగం ఉండదన్నారు. ఎన్‌95 మాస్కులను శుభ్రం చేసే పద్ధతులు వేరే ఉన్నాయని, అవి అందరూ చేసేవి కావని వివరించారు..
అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే- ఎన్‌95 మాస్కులు అందరికీ ఉద్దేశించినవి కావవన్నారు. డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్‌ డ్రైవర్లు, వైద్య సిబ్బంది వంటి వారికి మాత్రమే అని చెప్పారు. అలాగే కరోనా బారినపడి ఇంట్లో విడిగా ఉంటున్నవారు, వారికి సపర్యలు చేసేవారు వీటిని వాడుకోవాల్సి ఉంటుందన్నారు. మిగతా వారంతా మూడు పొరలతో కూడిన సర్జికల్‌ మాస్కులు సరిగ్గా ధరిస్తే చాలన్నారు.

సాధారణంగా ఎన్‌95 మాస్కులను ప్రతి 8 గంటలకు మార్చాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా ఎక్కువ విజృంభిస్తుండటం, ఎన్‌95 మాస్కుల వాడకం పెరిగిన నేపథ్యంలో వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఇప్పుడు 20 రోజులకు 5 మాస్కులను మాత్రమే వాడుకోవటానికి ఇస్తున్నారని తెలిపారు. వీటిల్లో ఒకటి అత్యవసర వాడకానికి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. తొలిరోజున ఒక మాస్కును వాడిన తర్వాత దాన్ని అదే కవర్‌లో భద్రపరచుకోవాలి. మర్నాడు రెండో మాస్కును వాడుకొని దాన్ని అదే కవర్‌లో దాచుకోవాలి. ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజుల పాటు వాడుకోవాలి. ఐదో రోజున తొలిరోజున వాడిన మాస్కును ధరించాలి. ఆ మాస్కు మీద వైరస్‌తో కూడుకున్న తుంపర్లేవైనా అంటుకొని ఉంటే అప్పటికవి ఎండిపోతాయి. ఒకవేళ ఏదైనా మాస్కు చిరిగినా, దెబ్బతిన్నా పక్కన పెట్టుకున్న మాస్కును వాడుకోవాల్సి ఉంటుంది.



మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్‌ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్‌95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. అసలే మాస్కు లేకపోవటం కన్నా ఏదో ఒకటి మంచిదన్న ఉద్దేశంతోనే గుడ్డ మాస్కులు వాడుకోవాలని సూచిస్తున్నారు. సర్జికల్‌ మాస్కులు అందుబాటులో లేనప్పుడు వీటిని వాడుకోవటంలో తప్పులేదన్నారు. అయితే అందుబాటులో ఉంటే సర్జికల్‌ మాస్కులు వాడుకోవటమే ఉత్తమం అన్నారు. శాస్త్రీయంగా ఇవే సురక్షితం అన్నారు. ఒక సర్జికల్‌ మాస్కును ఒకరోజుకే వాడుకోవాలని, మర్నాడు కొత్తది వాడుకోవాలని సూచించారు. వీటిని కూడా ఉతికి, వాడుకోవటం సరికాదన్నారు నిపుణులు.