ప్రతిరోజు జింక్, విటమిన్ డి, బికాంప్లెక్స్ వేసుకుంటే కరోనాను తట్టుకోగలం : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

  • Published By: sreehari ,Published On : March 28, 2020 / 02:53 PM IST
ప్రతిరోజు జింక్, విటమిన్ డి, బికాంప్లెక్స్ వేసుకుంటే కరోనాను తట్టుకోగలం : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో గొంతు నొప్పి, దగ్గు, అయాసం లక్షణాలు ఉంటాయి.. కొంతమందిలో రుచి పసిగట్టలేక పోతారు. తినే ఆహారం రుచిని గుర్తించే స్థితిని కోల్పోతారు. సెన్స్ ఆఫ్ స్మెల్.. అని పిలుస్తారు. కరోనా వైరస్ కారణం కూడా కావొచ్చు.

గొంతు నొప్పి, దగ్గుతో పాటు ఈ రెండు లక్షణాలను కూడా పెద్దగా గుర్తించలేరని మరికొంతమందిలో డయోరియా, వాంతులు కూడా కనిపిస్తాయని చెప్పారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, బిపీ, ఉన్నవాళ్లలో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. 

కేన్సర్ ట్రీట్ మెంట్ తీసుకునేవారికి కూడా డేంజర్ అని చెప్పారు. ఇమ్యూనిటీతో పాటు బ్యాలెన్స్ డైట్ ఉండాలి. ప్రోటీన్లు ఉండాలి. విటమిన్స్ ఉండాలి. ఈ మూడు ఐటమ్స్ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.. విటమిన్ డి తక్కువగా ఉన్నోళ్లకి వైరస్ ఎటాక్ అవుతుంది. రోజుకు వీక్లీ ఒకటి వేసుకోవాలి.

విటమిన్ సి.. షూయింగ్ ట్యాబెట్లు తీసుకోవాలి. బికాంప్లెక్స్, జింక్ ట్యాబ్లెట్లను కూడా తీసుకుంటే వైరస్ నుంచి రక్షించుకోవచ్చునని తెలిపారు. వైరస్ ప్రభావం ఉన్న పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ప్రతిరోజు విటమిన్ సి, బికాంప్లెక్స్, జింక్, వీక్లీ విటమిన్ డి ట్యాబ్లెట్లను తీసుకుంటూ ఉండాలని తాము సిఫార్సు చేస్తున్నట్టు నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.