సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు చైనా ఆమోదం.. ప్రజలందరికి ఈ టీకా వేయొచ్చు!

సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు చైనా ఆమోదం.. ప్రజలందరికి ఈ టీకా వేయొచ్చు!

China Sinopharm Covid-19 vaccine for general use : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ కంటే ముందే చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సినోఫార్మ్ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది. సాధారణ ప్రజలందరికి వ్యాక్సిన్ అందించేందుకు అనుమతి లభించింది. ప్రజలందరికి అందుబాటులోకి వచ్చిన దేశీయ తొలి వ్యాక్సిన్‌గా సినోఫార్మ్ అవతరించింది. స్వదేశీ డ్రగ్ కంపెనీ సినోఫార్మ్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ కు షరతులతో కూడిన ఆమోదం లభించింది.

చివరి దశ ట్రయల్స్ నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కరోనా టీకా 79.3% ప్రభావవంతమైందని సినోఫార్మ్ ప్రకటించింది. గత రెండు వారాల్లో 3 మిలియన్లతో సహా అత్యవసర వినియోగానికి అనుమతించింది చైనా. ఇప్పటికే 4.5 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ అందించింది. ఫిబ్రవరిలో చంద్ర నూతన సంవత్సర సెలవుదినం ముందు 50 మిలియన్ల మందికి టీకాలు వేయడానికి ప్రయత్నిస్తోంది. చైనా రాబోయే రోజుల్లో సినోవాక్, కాన్సినో చేసిన వ్యాక్సిన్ల జాబితాను కూడా క్లియర్ చేసే పనిలో పడింది. ఆ వ్యాక్సిన్ల షాట్లు ఇప్పటికే సైనిక సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో సహా కొన్ని ప్రాధాన్యత గ్రూపులకు అందించాయి.

UAE, బహ్రెయిన్ ఇప్పటికే ఈ టీకాను ఆమోదించాయి. 2021 మొదటి త్రైమాసికంలో 1.2 మిలియన్ మోతాదుల సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయనున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. మొరాకో త్వరలోనే తన షాట్లతో టీకాలు వేసే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్లను చైనా.. ఆఫ్రికాతో పాటు ఎక్కువగా ఈజిప్ట్ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.