కరోనా మాస్క్‌లకు బదులుగా జిరాఫీ గెటప్‌లో ఆస్పత్రికి యువతి!

కరోనా మాస్క్‌లకు బదులుగా జిరాఫీ గెటప్‌లో ఆస్పత్రికి యువతి!

అసలే కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. వందలాది మంది ప్రాణాలు తీసేస్తోంది. వేలామంది వైరస్ సోకి ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో నుంచి బయట కాలు అడుగుపెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. కరోనా మహమ్మారి ఏ వైపు నుంచి సోకుతుందోనని వణికిపోతున్నారు చైనా వాసులంతా.

కరోనా నుంచి తమను రక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖానికి ఫేస్ మాస్క్ లేకుండా బయటకు రావడం లేదు. కరోనా దెబ్బకు ముఖానికి ఫేస్ మాస్క్‌లు కొరతతో దొరికే పరిస్థితి లేదు. అత్యవసరంగా బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ లేకుండా వెళ్లడం లేదు. చైనీస్ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

తన తల్లిదండ్రులకు మందులు కొనేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. బయటకు వెళ్దామంటే కరోనా భయం.. ఫేస్ మాస్క్ కొనేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో లేవు. ఆస్పత్రికి వెళ్లి మందులు తేవాలి.. తనకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఇంటిలోని ఓ జిరాఫీ కాస్ట్యూమ్ ను ధరించింది. శరీరమంతా నిండుగా జిరాఫీ సూట్‌ ధరించి మెల్లగా వీధుల్లో నడుస్తూ ఆస్పత్రికి చేరుకుంది. అసాధారణ డ్రెస్సింగ్‌లో కనిపించిన యువతని అక్కడివారంతా వింతగా చూడటం మొదలుపెట్టారు.

తన ఫ్యామిలీకి మందులు తెచ్చేందుకు ఫేస్ మాస్క్ లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. దక్షిణ పశ్చిమ చైనాలోని సిచుయాన్ నగరంలోని లుజ్హూ ప్రాంతంలో ఆస్పత్రికి జిరాఫీ కాస్ట్యూమ్ తోనే వెళ్లింది. ఫేస్ మాస్క్‌ల కొరత కారణంగా జిరాఫీతో పాటు మరో ఎలియన్ కాస్ట్యూమ్ కూడా యువతి కొనుగోలు చేసింది.

అప్పటివరూ తాను వాడిన ఫేస్ మాస్క్‌ల ఎక్స్ పెయిరీ తేదీకి ముందుగానే కొత్తవి కొనేందుకు ప్రయత్నించి విఫలమైంది. మరో దారి లేక కరోనా సోకకుండా ఉండేందుకు వీలుగా ఇలా జిరాఫీ క్యాస్టూమ్ ధరించినట్టు తెలిపింది. యువతికి జిరాఫీ డ్రెస్‌లో ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో హి అనే యువతి తన తలతో పాటు మొత్తం శరీరాన్ని జిరాఫీ కాస్ట్యూమ్ తో కవర్ చేసింది. కళ్లు దగ్గర చిన్న విండో మాదిరిగా ప్లాస్టిక్ ఫిల్మ్ ద్వారా చూస్తూ ఆస్పత్రివరకు నడుచుకుంటూ వచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి ముందు నుంచే తన తండ్రి శ్వాసపరమైన సమస్యలపై తరచుగా ఆస్పత్రికి వచ్చి రెగ్యులర్ పేషెంట్ కూడా. తన కుటుంబ సభ్యుల్లో తాను మాత్రమే ఆరోగ్యంగా ఉండటంతో ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం బయటకు వస్తున్నట్టు తెలిపింది.