Cancer Risk: శరీరంపై ఎండ పడకపోతే కూడా క్యాన్సర్ వస్తుంది -అధ్యయనం

యాంత్రిక జీవనంలో ఎండ పడడం కూడా కష్టం అవుతోంది. శరీరంపై ఎండ పడితేనే డీ విటమిన్ సప్లిమెంట్లు అందుతాయనే విషయం తెలిసిందే.

Cancer Risk: శరీరంపై ఎండ పడకపోతే కూడా క్యాన్సర్ వస్తుంది -అధ్యయనం

Cancer

Cancer Risk: యాంత్రిక జీవనంలో ఎండ పడడం కూడా కష్టం అవుతోంది. శరీరంపై ఎండ పడితేనే డీ విటమిన్ సప్లిమెంట్లు అందుతాయనే విషయం తెలిసిందే. ఇమ్యెునిటీకి సహాయంగా ఉండే డీ విటమిన్ ఉత్పత్తికి కారణం అతినీలలోహిత కిరణాలు.. అయితే, ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల చాలామందికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్‌ వస్తోందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 186దేశాల్లో 2017, 2018 సంవత్సరాల్లో అతినీల లోహిత కిరణాల స్థాయిని పరిశీలించి, ఆయా దేశాల్లో పెద్దపేగు-మలద్వార క్యాన్సర్‌ ఉద్ధృతికి కారణంపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో 45 ఏళ్లు పైబడ్డవారిలో యూవీబీ కిరణాలు లోపించడానికి, క్యాన్సర్‌ ముప్పు పెరిగేందుకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని స్పష్టంచేశారు.

అలాగే 148 దేశాల్లో సూర్యతాపం, ఓజోన్‌ స్థాయి, ప్రజల ఆహారవ్యవహారాలు, పొగతాగుట, సగటు ఆయుఃప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని, అతి నీల లోహిత కిరణాలు తక్కువగా ఉండే నార్వే, డెన్మార్క్‌, కెనడా తదితర దేశాలతో పాటు, అతిగా ఎండలు కాసే సూడాన్‌, నైజీరియా, ఇండియా, యూఏఈ దేశాలను పోల్చి చూశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే, విటమిన్‌ డి పుష్కలంగా దొరికితే మాత్రం క్యాన్సర్‌ ముప్పు తగ్గించుకోవచ్చునని స్పష్టంచేశారు.