అపోహ – నిజం : కరోనా వదంతులు, వాస్తవాలు

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 12:56 AM IST
అపోహ – నిజం : కరోనా వదంతులు, వాస్తవాలు

ఇప్పటిదాకా చాలా వైరస్‌లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్‌గా కరోనా స్ప్రెడ్‌ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు. అలాగే మిగతా వైరస్‌ల కంటే ఎక్కువగా ప్రాణాలు తీస్తుందనే ప్రచారం కూడా అబద్దం. ఆ వైరస్‌ సోకిన చాలామంది రికవరీ అయ్యారు.

పైగా కొత్త వైరస్‌ సోకిన వాళ్లంతా చనిపోవడం లేదు. గుండెజబ్బులు, క్యాన్సర్లతో పోల్చితే కరోనా వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య తక్కువే. ఇక కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేసి ప్రజల్లోకి వదిలారనే ప్రచారంలో కూడా నిజం లేదు. కరోనా తరహా వైరస్‌లు దాదాపు 60దాకా ఉన్నాయి. వీటిలో చాలా వరకూ జంతువుల నుంచీ జంతువులకూ.. ప్రాణుల నుంచీ ప్రాణులకూ వ్యాపిస్తున్నాయి. కాకపోతే కరోనా మాత్రం జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది. 

యాంటిబయోటిక్స్‌తో కరోనా వైరస్‌ సోకదనే ప్రచారంలో నిజం లేదు. యాంటి బయోటిక్స్‌ కేవలం బ్యాక్టిరియాను మాత్రమే దూరం చేస్తాయి. కరోనాను అంతం చేసే శక్తి వాటికి లేదు. అవి ఏమాత్రం రక్షణ ఇవ్వవు. న్యూమోనియాకు తీసుకునే ఇంజక్షన్లతో కరోనా దరిచేరదనేది కూడా పూర్తిగా అబద్దం. కరోనా వైరస్‌ పూర్తిగా కొత్తది. దానికి వేరే ఇంజక్షన్ ఉంటుంది. వైరస్‌ విరుగుడికి ల్యాబ్‌లలో ప్రయోగాలు జరుగుతున్నాయి.

అసలు న్యూమోనియాకు కరోనా వైరస్‌కు సంబంధమే లేదు. జంతువుల నుంచి వైరస్‌ సోకినట్టు ఎక్కడా ప్రూవ్ కాలేదు. ఒకవేళ జంతువుల్ని తాకినట్టయితే చేతుల్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇక చైనా నుంచి వచ్చే ప్యాకేజీలు, లగేజీలతో వైరస్ వస్తుందనే పుకార్లు కూడా ఒట్టివే. చైనా నుంచి మన దగ్గరకు రావాలంటే నాలుగైదు రోజుల సమయం పడుతుంది. అంతకాలం వైరస్ బతికే అవకాశమే లేదు. 

ఇప్పటిదాకా మన దేశంలో ఉన్నవాళ్లెవరికీ కరోనా వైరస్‌ సోకలేదు. బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్లకి.. వాళ్లను కలిసిన వారికి మాత్రమే ఈ వైరస్‌ అంటుకుంది. జాగ్రత్త చర్యలు చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వైరస్‌కి ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసానిస్తున్నాయి. పుకార్లు మాత్రం నమ్మొద్దని విఙ్ఞప్తి చేస్తున్నాయి. 

Read More : గుడ్ న్యూస్ : ఏపీలో కరోనా లేదు!