కరోనా వైరస్ మూడు మార్గాల్లో సోకుతోంది.. ఇది మాత్రం డేంజర్!

  • Published By: sreehari ,Published On : February 15, 2020 / 01:30 PM IST
కరోనా వైరస్ మూడు మార్గాల్లో సోకుతోంది.. ఇది మాత్రం డేంజర్!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ COVID-19 విజృంభిస్తోంది. రోజురోజుకీ వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ ఎన్ని మార్గాల్లో వ్యాపిస్తోంది అనేదానిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) షాకింగ్ రీజన్ బయటపెట్టింది. SARS వంటి ప్రాణాంతకమైన వైరస్ మాదిరిగా ఒకే మార్గంలో కరోనా వైరస్ సోకదని తెలిపింది.

తొలుత వైరస్ వచ్చిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకుతుంది అనే విషయాన్ని అమెరికాలో జనవరి 2020లో ధ్రవీకరించారు. అయితే, వైరస్ వ్యాప్తి చెందడంలో ఎలాంటి మార్గంలో వేగంగా వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు సీడీసీ ఎన్నో అంశాలపై సోధించింది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకే క్రమం ఎలా ఉంటుంది? ఎన్నో దశలో ఉంటుంది? అనేదానిపై మరిన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైరస్ వృద్ధిచెందే కాలం 14 రోజులు :
వాస్తవానికి COVID-19 వైరస్ (ఇంక్యూబేషన్ పిరియడ్) వృద్ధిచెందడానికి అటుఇటుగా 14 రోజులు ఉంటుంది. ఈ సమయంలో వైద్యసాయం అందించడమనేది పెద్ద సవాల్‌గా మారుతోంది. వ్యాధి సోకిన వెంటనే బాధితులకు పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఇన్ఫెక్షన్ లేదంటూ నెగిటీవ్ ఫలితం వస్తోంది. ఈ ఒక్క విషయంలోనే వైద్యుల్లో అనుమానాన్ని రేకిత్తిస్తోంది.

వైరస్ వృద్ధి చెందడానికి ఈ 14 రోజుల సమయంలో ఎప్పుడైనా ఆ వ్యక్తిలో ఇన్ఫెక్షన్ తిరగబెట్టొచ్చు. అందుకే వైరస్ సోకినట్టు అనుమానమస్తే వెంటనే వారికి ప్రత్యేకమైన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ చేయాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. ప్రధానంగా వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అందరికి తెలుసు. వైరస్ సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్నప్పుడే.. అంటే.. 6 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి ఈజీగా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.

ఇదొక మార్గమే డేంజర్ :
వైరస్ బాధితుడు తుమ్మినా లేదా దగ్గినప్పుడు గాలిద్వారా బయటకు వచ్చే ఈ వైరస్.. ఇతరులు పీల్చినప్పుడు మరొకరిలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి వారిలో శ్వాసపరమైన సమస్యలు అధికమవుతాయని నేషనల్ సెంటర్ ఫర్ ఇమ్యూనైజేషన్ అండ్ రిస్పిరేటరీ డిసిజేస్ ఎండీ డైరెక్టర్ నాన్సీ మెస్సోనీయర్ తెలిపారు. సోకిన వారిలో ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడే తమకు వైరస్ సోకింది అని తెలిసే అవకాశం ఉంటుందన్నారు.

ఏది ఏమైనా, మరో రెండు మార్గాల్లో కరోనా వైరస్ సోకుతుందని చెబుతున్నారు. అది.. వైరస్ బాధితుడిని తాకినప్పుడు లేదా వైరస్ ఉన్న ఉపరితలాలను తాకడం.. మరొకటి.. కళ్లు, ముక్కు, నోటిని తాకడం ద్వారా కూడా వైరస్ సోకుతుందని నాన్సీ తెలిపారు. వైరస్ సోకిన సమయంలో అప్పటికే సీజనల్ ఫ్లూ వంటి ఉన్నప్పుడూ గుర్తించడం చాలా కష్టమని అన్నారు. వాస్తవంగా చూస్తే.. వైరస్ సోకినప్పుడు తొలుత కనిపించే లక్షణాల్లో దగ్గడం, తుమ్మడం ఒకటిగా చెప్పవచ్చు. కానీ, ఈ చివరి రెండు మార్గాల్లో వైరస్ వ్యాపించడానికి ప్రధాన వాహకం కాదని నమ్మలేమని ఆయన చెప్పారు.

శాంపిల్స్ టెస్టింగ్ ఆలస్యం :
కరోనా వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించి శాంపిల్స్ పరీక్షించే సమయం ఆలస్యం కావడం కూడా వ్యాప్తిని నియంత్రించ లేకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఫాస్ట్ ట్రాక్ కరోనా వైరస్ అసిస్ మెంట్ ద్వరా ఇన్ఫెక్టడ్ శాంపిల్స్ టెస్టింగ్ చేసేందుకు అమెరికాలో ఇదివరకే చర్యలు చేపట్టారు. వైరస్ శాంపిల్స్ పరీక్షించే పదార్థంలో కొన్ని సమస్యలను సీడీసీ గుర్తించింది. ఎందుకంటే కొన్ని ల్యాబుల్లో పరీక్షలు జరిపే వాటిలో పూర్తి స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. అందుకే ఆయా ల్యాబుల్లో సీడీసీ పర్యవేక్షిస్తోంది.

ప్రస్తుతం.. సీడీసీ ల్యాబుల్లోని పరీక్షా పదార్థాలను తిరిగి రూపొందిస్తోందని నాన్సీ తెలిపారు. ఇదిలా ఉండగా, COVID-19 ఒక వైరస్ మాత్రమే అతిపెద్ద ముప్పు కాదు.. అమెరికాలో ఈ సీజన్ సమయంలో H1N1 (స్వైన్ ఫ్లూ) , aka Influenza వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు చాలామందిలో ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. 2018లో ప్రబలిన ఈ వైరస్ తీవ్రతో కారణంగా ఇప్పటివరకూ 250,000 మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చేరగా, 14వేల మంది మృతిచెందారు.

Read More>>కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం,విమానం ఎక్కగానే సరికాదు సభ్యత ఉండాలి