వచ్చింది మాములు జలుబేనా.. ఫ్లూ లేదా కరోనా.. ఎలా తెలుసుకోవడం?

  • Published By: sreehari ,Published On : October 7, 2020 / 04:07 PM IST
వచ్చింది మాములు జలుబేనా.. ఫ్లూ లేదా కరోనా.. ఎలా తెలుసుకోవడం?

Coronavirus symptoms: చలికాలం వచ్చేస్తోంది.. జలుబు, ఫ్లూ వంటి సీజన్ వ్యాధులకు ఇదే సీజన్.. ఇప్పటికే కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది.. ఈ సీజన్ సమయంలో కొంచెం జలుబు చేసినా జ్వరం వచ్చినా వామ్మో.. కరోనా అంటూ హడలిపోతున్నారు. ఏది జలుబో, ఏది ఫ్లూనో.. ఏది కరోనా వైరస్ తెలియని గందరగోళ పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన వ్యాధి ఏంటి? అని గుర్తించడం ఎలా అనేదానిపై ఇంగ్లండ్ లోని NHS ఆన్ లైన్ కోవిడ్-19 సలహా సూచనలను అందిస్తోంది. ఈ మూడింటి రకాల మధ్య తేడాలను ఎలా గుర్తించాలో వివరించింది. అవేంటో ఓసారి చూద్దాం..



Coronavirus (Covid-19) :
కరోనా వైరస్ వచ్చినవారిలో ఎక్కువగా కనిపించే ప్రధాన లక్షణం జ్వరం (fever). 37.8C (100F) శరీర ఉష్టోగ్రత ఉంటుంది. రెండోది దగ్గు.. చాలా పొడిగా ఉంటుంది. వాసన తేలియకపోవడం, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అలసట, నొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, డయేరియా, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో తేలికపాటి నుంచి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.



Cold (జలుబు) :
శీతాకాల సీజన్ సమయంలో ఎక్కువగా జలుబు చేస్తుంటుంది. వాతావరణం చలిగా చల్లగా ఉండటంతో చాలామందికి వెంటనే జలుబు చేసేస్తుంటుంది. జలుబు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాల్లో తుమ్ములు, నొప్పులు, ముక్కు కారడం, నాసిక రంధ్రాలు మూసుకుపోవడం, గొంతు నొప్పి వంటివి సాధారణంగా లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అలసగానూ నీరసంగా అనిపిస్తుంది. అరుదుగా జ్వరం లేదా తలనొప్పి కూడా రావొచ్చు. జలుబు కారణంగా డయేరియా రాదు.



Flu (ఇన్‌ఫ్లూయంజా) :
influenza వైరస్ సోకిన వారిలో సాధారణంగా జ్వరం వస్తుంది. తీవ్ర అలసటగా ఉంటుంది. పొడి దగ్గు కూడా వస్తుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ లేదా గొంతు నొప్పి ఉండొచ్చు. చిన్నపిల్లల్లో అయితే డయేరియా కూడా ఉంటుంది. ఫ్లూ వచ్చినవారిలో కూడా తుమ్ములు రావు.. కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు.