కరోనావైరస్ లక్షణాల్లో 6 రకాల కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా?

  • Published By: sreehari ,Published On : August 6, 2020 / 06:16 PM IST
కరోనావైరస్ లక్షణాల్లో 6 రకాల కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా?

ప్రపంచమంతా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పంజా నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు.. కంటికి కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. కరోనా వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయని అందరికి తెలుసు.. కానీ, మనకు  తెలియని ఆరు కరోనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చేసింది.. కరోనా వైరస్ లక్షణాల మాదిరిగానే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని వెల్లడించింది. అవేంటో ఓసారి చూద్దాం..

1. కరోనావైరస్ వేర్వేరు మార్గాల్లో సోకుతుంది :
COVID-19 కేసులు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల మార్కును దాటేశాయి. వైరల్ వ్యాప్తి గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.. కరోనావైరస్ వ్యాప్తి చేయడంలో భిన్నంగా ఎందుకు ప్రభావితం చేస్తుందో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చాలామందిలో స్వల్పంగా వ్యాధులు ఉండగా , అధిక-ప్రమాదకర వర్గాలకు చెందిన కొందరు మరింత తీవ్రమైన ప్రమాదాన్ని కలిగి ఉంటారు.



మరికొందరిలో ఎలాంటి లక్షణాలే కనిపించవు.. వైరస్ ఒత్తిడి ఉంటే.. కోలుకున్న తర్వాత కూడా వారిపై శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వైరస్‌తో జీవించడం నేర్చుకోవచ్చు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.. ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఒకే ఒక్క వైరస్ కోవిడ్ అంటున్నారు.. కానీ, ఆరు రకాల అంటు వ్యాధులు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

2. లక్షణాల్లో మొదటి వారమే కీలకం :
కరోనా వైరస్ సోకిందనడానికి మొదటి వారంలోని లక్షణాలే కీలకమని అంటున్నారు. వ్యాక్సిన్ లేదా ఒక చికిత్సా ప్రణాళిక ఉండి తీరాలన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనాను ఇతర వ్యాధుల డ్రగ్స్‌ కాంబేషన్ తో పరీక్షించి చూస్తున్నారు. నివారణ చర్యలను పాటించడంతో పాటు కరోనా వ్యాప్తిని నియంత్రంచడం తప్ప మరో మార్గం లేదు.. అధ్యయనాల ప్రకారం.. మొదటి వారంలో గమనించిన లక్షణాలు వైరస్ వ్యాప్తిని గుర్తించడంలో కీలకమని చెబుతోంది.

3. మొదటి వారంలోనే లక్షణాలతో వైరస్ తీవ్రతను గుర్తించొచ్చు :
కరోనా వ్యాప్తిపై ఒక వారంలో గమనించిన వివిధ రకాల లక్షణాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.. వైరస్ సోకిన మొదటివారంలో కనిపించే లక్షణాలతోనే వైరస్ తీవ్రతను అంచనా వేయొచ్చునని అంటున్నారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉందా లేదో గుర్తించవచ్చునని చెప్పారు.



4. అధ్యయనం :
యూకే, అమెరికాలో 1600 మంది రోగులపై అధ్యయనం సాగింది.. మార్చి, ఏప్రిల్ నెలల మధ్య కాలంలో వారిలో COVID-19 లక్షణాలను గుర్తించారు. చాలా మంది రోగులు ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్లేవు.. అందుకే మొదటి 8-10 రోజులలో వారిలో కనిపించిన లక్షణాలు ఎలా ఉన్నాయో అడిగి నమోదు చేశారు పరిశోధకులు.. మూడు గ్రూపుల్లో తేలికపాటి వర్గానికి చెందినవిగా గుర్తించారు. మూడు మరింత తీవ్రమైన వర్గానికి చెందినవిగా తేల్చారు. ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో వైరస్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు.

5. క్లస్టర్ 1: జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ :
వైరస్ సోకినప్పుడు తేలికపాటి లక్షణాలు ఉంటాయి.. మొదటి క్లస్టర్ ఎగువ శ్వాసకోశంలో లక్షణాలు కనిపిస్తాయి. అంటే.. వైరల్ లోడ్ పెరిగింది. ఈ రకమైన వ్యాప్తితో బాధపడే వ్యక్తులు జలుబు, గొంతు, ముక్కు దిబ్బడ, ఛాతీ నొప్పి, కండరాల నొప్పి , వాసన కోల్పోవడం, తలనొప్పి వంటి లక్షణాలను నమోదు చేశారు. వీరిలో ఎలాంటి జ్వరం కనిపించలేదు.



6. క్లస్టర్ 2: జ్వరంతో ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ :
మొదటి క్లస్టర్ కంటే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది.. ఈ వర్గానికి చెందిన రోగులు తేలికపాటి ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉంది. జ్వరం, ఆకలి తగ్గడం లేదని ధృవీకరించారు. ఈ గ్రూపులో పొడి దగ్గు లేదా ‘కోవిడ్’ దగ్గు లక్షణం కావొచ్చు.. గొంతులో మొద్దుబారడం వంటి లక్షణం కూడా కనిపించిందని చెప్పారు.

7. క్లస్టర్ 3: జీర్ణశయాంతర వ్యాప్తి :
ఈ క్లస్టర్‌కు చెందిన రోగులు వారి జీర్ణక్రియ, జీర్ణశయాంతర పనితీరుపై కరోనా వైరస్ దాడి చేస్తుంది. ఈ తరహా లక్షణాలతో చాలామంది బాధపడ్డారు. ఈ క్లస్టర్‌లో దగ్గు ప్రముఖ లక్షణం కాదు.. వీరిలో ఎక్కువగా వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు ఎక్కువగా కనిపించాయి. తలనొప్పి, ఛాతీ నొప్పి కూడా ఉన్నట్టు తెలిపారు.

8. క్లస్టర్ 4: తీవ్రమైన స్థాయి 1లో అలసట :
కరోనా వైరస్ సోకిన బాధితుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో శక్తిని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇదో రకమైన లక్షణం.. రోగనిరోధక శక్తి తగ్గడంతో అలసటగా అనిపిస్తుంది.. తీవ్రమైన COVID-19కు హెచ్చరికకు ఇదే బండగుర్తు.. ఈ వర్గంలోని రోగులు అలసట, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం, గొంతు నొప్పి, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.



9. క్లస్టర్ 5: తీవ్రమైన స్థాయి 2లో గందరగోళం:
స్థాయి 1 కన్నా ఇది చాలా తీవ్రమైనదిగా చెబుతున్నారు. ఈ క్లస్టర్‌లోని లక్షణాలు నాడీ పనితీరును ప్రభావితం చేస్తుంది. COVID మెదడుపై కలిగించే శాశ్వత ప్రభావానికి దారితీస్తుంది.. ఈ వర్గంలో వారిలో తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, మొద్దుబారడం, గందరగోళం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలసట, కండరాల నొప్పి సాధారణంగా కనిపిస్తుంది.

10. క్లస్టర్ 6: తీవ్రమైన స్థాయి 3లో ఉదర, శ్వాసకోశ బాధ :
మొదటి వారాల్లో కనిపించే అత్యంత తీవ్రమైన లక్షణాల్లో ఇదొకటి.. గందరగోళం, గొంతు, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, విరేచనాలు, ఊపిరి, కండరాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్లస్టర్‌కు చెందిన వ్యక్తులు ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంది. వెంటిలేషన్, ఆక్సిజన్ సపోర్ట్ తప్పక అవసరం..

11. మనకు ఏమి తెలుసు :
ఆరు గ్రూపుల్లో వివరించిన లక్షణాలు COVID-19 వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయనే ఎన్నో సందేహాలు ఉన్నాయి.. అన్ని రోగులలో, అన్ని క్లస్టర్‌లో తలనొప్పి స్థిరంగా కనిపించింది. చివరి రెండు ఒకేరకమైన గ్రూపులను మినహాయించి 3-4 రోజుల తరువాత క్షీణించింది. 4వ రోజు పోస్ట్ ఇన్ఫెక్షన్ తర్వాత మాత్రమే రోగులలో రుచి, వాసన కోల్పవడం కనిపించింది. వ్యాధి తీవ్రతలో వ్యత్యాసం 4-5 రోజుల వ్యాప్తి తర్వాత మాత్రమే గమనించవచ్చు.

12. ఎవరికి ఆస్పత్రి అవసరం? :
తేలికపాటి లేదా క్లస్టర్‌కు చెందిన రోగులు మొదటి వారంలో అలసట లక్షణాలు కనిపించలేదు.. తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు, కొన్ని క్లిష్టమైన లక్షణాలు మొదటి రోజు ప్రారంభంలోనే గుర్తించారు. ఈ లక్షణాలలో శ్వాస తీసుకోక పోవడం, అలసట, కడుపు నొప్పి ఉన్నాయి.. 4, 5 లేదా 6 క్లస్టర్లకు చెందిన వ్యక్తులు బలహీనంగా ఉంటారు.



అధిక బరువు కలిగి ఉంటారు. టైప్ 1, 2 ఉన్నవారి కంటే డయాబెటిస్ లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ముందే ఉంటే వారిలో కరోనా ప్రభావం ప్రాణాంకంతంగా మారుతుందని విశ్లేషకులు సూచించారు. 3. క్లస్టర్ 1 ఉన్నవారిలో 1.5%, క్లస్టర్ 2 ఉన్నవారిలో 4.4%, క్లస్టర్ 3 ఉన్న 3.3% మందికి మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్ అవసరమని గుర్తించారు.

13. క్లస్టర్లను గుర్తించడం.. సెకండ్ వేవ్ నివారణ.. ప్రాణాలను కాపాడొచ్చు :
కింగ్స్ కాలేజ్ చేసిన అధ్యయనాన్ని ఇంకా సమీక్షించలేదు.. అయినప్పటికీ క్లస్టర్లను గుర్తించడం వలన పర్యవేక్షణ లక్షణాలు ఎంత కీలకమైనవో గుర్తించవచ్చు.. ఇతరులకన్నా ఎక్కువ అవసరమయ్యే వారికి ప్రాధాన్యతనిస్తారు.

కొన్ని దేశాలలో సెకండ్ వేవ్ వైరస్ ప్రభావాన్ని నివారించడానికి సరైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారో గుర్తించాలి.. సకాలంలో చికిత్స అందించాలి. ప్రాణాలను కాపాడటానికి వైద్యుల సాయం తప్పనిసరిగా ఉండాలని అధ్యయన విశ్లేషుకులు సూచిస్తున్నారు.