కరోనా ఎఫెక్ట్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విదేశీయులపై నిషేధం!

  • Published By: sreehari ,Published On : March 9, 2020 / 02:16 AM IST
కరోనా ఎఫెక్ట్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విదేశీయులపై నిషేధం!

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన కొంతమందిలో వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా నమోదు అయినప్పటికీ కరోనా భయం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోకి వచ్చేవారిని ఎయిర్ పోర్టుల్లోనే నిశితంగా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విదేశీయులపై నిషేధం విధించింది. విదేశీయులకు జారీ చేసే ప్రొటెక్టడ్ ఏరియా పర్మిట్స్ (PAPs)ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించాలంటే విదేశీయులకు తప్పనిసరిగా PAP అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే ఛీప్ సెక్రటరీ నరేశ్ కుమార్ PAP జారీ చేసే అధికారులందరికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు PAPలను తాత్కాలికంగా సస్పెండ్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.

కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకీ భారత్‌‌లో పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి విదేశాల నుంచే వచ్చేవారి ద్వారే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే అరుణాచల్ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సిక్కిం రాష్ట్రంలోకూ విదేశయుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. హిమాలయన్ కింగ్ డామ్ భూటన్ లో కూడా తమ సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీయులపై కూడా ఆంక్షలు విధించాయి.(మరణమృదంగం : క్యా కరోనా..3 వేల 98 మంది మృతి)

See Also | ఏటా పెరుగుతున్న తలసరి అప్పు