కోవిడ్-19 యాంటీబాడీలు 8 నెలలు వరకు ఉంటాయట!

కోవిడ్-19 యాంటీబాడీలు 8 నెలలు వరకు ఉంటాయట!

COVID-19-antibodies

COVID-19 antibodies last as long as 8 months : కరోనా కొత్త రంగు పులుముకుంది.. కరోనా కొత్త ముల్లు పుట్టుకొచ్చింది.. మొదట్లో వచ్చిన కరోనా కంటే ఈ కరోనా కొత్త వేరియంట్.. మహా డేంజర్ అంట.. SARS-Cov (2003) వైరస్ ప్రభావం ఆధారంగా SARS-Cov-2 (2020) వైరస్ ఇమ్యూనిటీని అంచనా వేయగలిగారు పరిశోధకులు. SARS-CoV ఇన్ఫెక్షన్ మాదిరిగానే SARS-CoV-2 కూడా ప్రధానంగా యాంటీబాడీలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులోని స్పైక్.. nucleocapsid proteins (NCP)లతో కూడి ఉంటుంది. అయితే కరోనా నుంచి కోలుకున్నవారిలో ఎంతకాలం యాంటీబాడీలు ఉంటాయి అనేది స్పష్టత లేదంటున్నారు.

కానీ, కొత్త అధ్యయన ఫలితాల్లో యాంటీబాడీలు 8 నెలల కాలం ఉంటాయని తేల్చిచెబుతున్నాయి. అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చునని సూచిస్తున్నాయి. అందులోనూ కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో మరింత కాలం ఇమ్యూనిటీని పెరిగిపోవచ్చునని అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. దీనికి సంబంధించి అధ్యయనాన్ని సైన్స్ ఇమ్యూనోలాజీలో ప్రచురించారు. కరోనా సోకిన ఆస్ట్రేలియన్లలో మొదటి నాల్గో రోజు నుంచి 242 రోజుల వరకు వారిపై అధ్యయనం చేశారు.

అందరిలోనూ మెమెరీ B కణాలు ఇమ్యూనిటీని ప్రేరేపించాయని తద్వారా యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. వీరిలో ఈ యాంటీబాడీలు 8 నెలల పాటు ఉన్నాయని ఆ తర్వాత మళ్లీ వీరిలో కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు పరిశోధకులు నిర్ధారించారు. రెండోసారి కరోనా సోకిన వారి రక్త నమూనాలను రీసెర్చర్లు సేకరించారు. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 36 మంది కరోనా బాధితుల నుంచి ఈ నమూనాలను సేకరించారు. వీరిలో యాంటీబాడీల స్థితి, వైరస్ స్థాయిలు, రోగనిరోధక కణాలు ఎంత ఉన్నాయో గుర్తించారు.

వైరస్ సోకిన 6 రోజు నుంచి యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు అధ్యయనంలో తేలింది. ఇమ్యూనోగ్లోబిన్ G స్థాయిలు 20 రోజుల తర్వా నుంచి యాంటీబాడీలు తగ్గిపోయాయని గుర్తించారు. ఇన్ఫెక్షన్ సోకిన 150 రోజుల తర్వాత మెమెరీ B కణాల స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయని గుర్తించారు. సౌత్ కొరియాలో కరోనా అసింపథిటిక్ లేదా స్వల్ప కరోనా ఇన్ఫెక్షన్ సోకిన 58మంది కరోనా బాధితుల్లో 8 నెలల తర్వాత యాంటీబాడీల స్థాయిలో ఎంతకాలం ఉన్నాయో మరో అధ్యయనంలో గుర్తించారు.