కరోనా దెబ్బకు ఇటలీకి తాళం : నిర్భందంలో వందలాది తెలుగు విద్యార్థులు

  • Published By: sreehari ,Published On : March 11, 2020 / 07:26 AM IST
కరోనా దెబ్బకు ఇటలీకి తాళం : నిర్భందంలో వందలాది తెలుగు విద్యార్థులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా భయంతో ఇటలీలో 4వంతు జనాభాను దిగ్భందం చేసింది ఆ దేశ ప్రభుత్వం. కనీసం ఒకరిని కూడా బయటకు రానివ్వడం లేదు. కఠినమైన ఆంక్షలు విధించారు. ఇటలీలో అన్ని మూతపడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎవరని బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇటలీలో మన తెలుగోళ్లు కూడా చిక్కుకుపోయారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వందలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. COVID-19 కేసులు తీవ్రతతో ఎక్కడికెక్కడ దిగ్బంధం చేశారు. పడోవా, రిమిని, మోడెనా, మిలాన్ ప్రాంతాల్లో మన తెలుగు విద్యార్థులు ఉంటున్నారు. ఈ ప్రాంతాలన్నీ కరోనా ప్రభావంతో రెడ్ జోన్లుగా ప్రకటించింది ఇటలీ ప్రభుత్వం. మార్చి 9 వరకు ఇటలీలో వైరస్ బారినపడి 97 మంది మృతిచెందారు. ప్రత్యేకించి విదేశీ ప్రయాణాలపై మంగళవారం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దాంతో తెలుగు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

మాస్క్‌ల కొరత, సూపర్ మార్కెట్ల వద్ద ప్రవేశ ఆంక్షలతో విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రతిఒక్కరూ ఇళ్లలో దిగ్భందమైయ్యారని, అన్ని పబ్లిక్ ప్రదేశాలన్నీ మూతపడినట్టు తెలిపారు. వైరస్ లక్షణాలు లేనివారిని తనిఖీ చేసే నిబంధనలు లేవని, అక్కడి ఆస్పత్రులు ఫిట్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు అంగికరీంచవని, అందుకే తిరిగి రావడం కష్టంగా మారుతోందని తెలుగు విద్యార్థులు వాపోతున్నారు.

మరోవైపు భారత రాయభార కార్యాలయ అధికారులు కూడా విద్యార్థుల తరలింపు కోసం ఫిట్ సర్టిఫికేట్లను పరిశీలించాలని అక్కడి ప్రభుత్వాన్ని పట్టుబడుతోందని తెలిపారు. తెలంగాణలోని సూర్యపేట జిల్లా, కోదాడకు చెందిన బద్రినాథ్ గెల్లా ఇటీవలే తన ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ఇటలీలోని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో (931 చరిత్రగల) ఒకటైన యూనివర్శిటీకి చెందిన చాలామంది విద్యార్థులు చిక్కుకుపోయారు.

బోల్గోనా ప్రాంతంలో సుమారు 30 మంది వరకు చిక్కుకుపోయినట్టు తెలిపారు. ఆందోళన ఉంది.. తమకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందడానికి సమయం ఎక్కువగా పడుతోందని బద్రినాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. యూనివర్శిటీలోని పడోవాలో దాదాపు 50 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.(ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు?)

ఈ ప్రాంతం కూడా కరోనా రెడ్ జోన్ లో ఉంది. వీరిలో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండగా, అందులో విజయవాడకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మోడెర్నా ప్రాంతంలో ఉన్నారు. అనంతపూర్ నుంచి లీలా కృష్ణా చౌదరి పడోవాలో అగ్రికల్చర్ చదువుతున్నాడు. పడోవాలో తమను నిర్భంధంలో ఉంచారని.. తిరిగి భారత్ రాలేకపోతున్నామని వాపోయాడు.ఇతర నగరాలకు కూడా వెళ్లేందుకు అనుమతించడం లేదన్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ చరణ్ తేజ.. మిలాన్ నగరంలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

కొండెంగ్నో దిగ్బందం చేయడంతో స్టోర్లన్నీ మూసేశారు. గ్రాసరీ స్టోర్లు కూడా మూతపడ్డాయని చరణ్ తేజ తెలిపాడు. ఇటలీలో మొత్తం 100 తెలుగు విద్యార్థులు ఉన్నారు. సూపర్ మార్కెట్లోకి వెళ్లేందుకు 10మందికి మించి వెళ్లేందుకు అనుమతించడం లేదు. హెల్త్ చెకప్ ల విషయంలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే 1500 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలి. అప్పుడు మాత్రమే వారిని ప్రత్యేకవార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.