Covid-19 లక్షణాలు ఎప్పుడూ ఈ క్రమంలోనే కనిపిస్తాయి.. ఎలాగంటే?

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 04:25 PM IST
Covid-19 లక్షణాలు ఎప్పుడూ ఈ క్రమంలోనే కనిపిస్తాయి.. ఎలాగంటే?

COVID-19 Symptoms: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా సోకినవారిలో ఒక్కొక్కరిలో ఒక్కోలా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా.. కరోనా సోకినవారిలో వైరస్ లక్షణాలు తరచుగా ఒక నిర్దిష్ట క్రమంలోనే కనిపిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. University of Southern Californiaకు చెందిన రీసెర్చర్లు చేసిన ఈ అధ్యయనాన్ని ‘Modeling the Onset of COVID-19 Symptoms’ అనే పేరుతో Frontiers in Public Health journalలో ప్రచురించారు.



కరోనా లక్షణాలను అత్యంత సాధారణ క్రమంగా అధ్యయన బృందం వివరించింది. ఇతర సీజన్ వైరస్ లక్షణాలైన ఫ్లూ, అలర్జీల మాదిరిగానే ఈ కరోనా లక్షణాలు ఎక్కువమంది బాధితుల్లో కనిపించాయని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పేర్కొన్నారు.

covid-19 లక్షణాల క్రమం ఏంటి? :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. చైనాలో 55వేల మంది బాధితులపై అధ్యయన బృందం విశ్లేషించింది. వైరస్ సోకిన వీరిలో ఎక్కువ మందికి అత్యంత తరచుగా కనిపించిన తొలి లక్షణంగా జ్వరాన్ని గుర్తించారు. ఆ తర్వాత దగ్గు కనిపించింది. ఒళ్లు నొప్పులు, గొంతులో నొప్పి, కండరాల నొప్పులు, తలనొప్పి, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి. చివరి లక్షణంగా చాలామందిలో డయేరియా కనిపించింది.



influenza వంటి వైరస్ సోకినవారిలో ముందుగా దగ్గు లక్షణంగా కనిపిస్తుంది. అదే covid-19 లక్షణాల్లో అయితే జ్వరం ముందుగా కనిపిస్తుందని అధ్యయనం వెల్లడించింది. SARS, MERS సోకినవారిలో gastrointestinal లక్షణాల కంటే Covid-19 వైరస్ సోకినవారిలో లక్షణాలు మరోలా ఉంటాయి.



అందరిలో ఒకేలా ఉండదు :
కరోనా వైరస్ సోకినవారిలో చాలామందిలో సాధారణ జలులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. చాలావరకు కరోనా కొత్త కేసుల్లో ఈ సాధారణ లక్షణాలే ఎక్కువగా కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. అందరిలో కరోనా లక్షణాలు ఒకేలా ఉండవని అంటున్నారు.



ఒక్కొక్కరిలో కరోనా లక్షణాలు ఒక్కోలా ఉంటాయని చెబుతున్నారు. ఎవరిలో ముందుగా ఏ లక్షణం కనిపిస్తుందో చెప్పలేమని అధ్యయన బృందం పేర్కొంది. కరోనా ఇతర లక్షణాల్లో శ్వాస తీసుకోలేకపోవడం, రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట వంటి లక్షణాలు కూడా ఎక్కువమందిలో కనిపించాయని అధ్యయన బృందం తెలిపింది.