కరోనా వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి.. అసలు వాస్తవాలివిగో!

కరోనా వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి.. అసలు వాస్తవాలివిగో!

COVID-19 Vaccines Work Good : యూకే, అమెరికాలో మొదటి టీకాలు ఆమోదం పొందిన రెండు నెలల తరువాత షాట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ బలమైన డేటా వెలువడింది. COVID-19 నుండి ప్రజలను రక్షించగలదని రుజువైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఫిబ్రవరి 24న ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇజ్రాయెల్, అమెరికా పరిశోధకులు ఫైజర్-బయోఎంటెక్ అభివృద్ధి చేసిన టీకా COVID-19 వైరస్ నుంచి రక్షించడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా తేలింది. ఈ వ్యాక్సిన్ కరోనాతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పూర్తిగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా తీవ్రమైన COVID-19తో ఆస్పత్రిలో చేరే రేటును తగ్గించిందని అంటున్నారు. స్కాట్లాండ్‌లోని ఆరోగ్య అధికారులు కూడా ఫైజర్-బయోఎంటెక్ లేదా ఆస్ట్రాజెనెకా షాట్‌తో టీకాలు వేయడం వల్ల కరోనాతో ఆసుపత్రిలో చేరే రేటు తగ్గడానికి సాయపడిందని పరిశోధకులు అధ్యయనంలో నివేదించారు. మొదటి షాట్ తర్వాత ఒక నెలలోపు COVID-19 ఆస్పత్రిని తగ్గించడంలో టీకా ప్రభావంతంగా పనిచేసిందని, ఒక మోతాదు 85శాతం నుంచి 94శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించారు.

92శాతం వ్యాక్సిన్ ప్రభావవంతం :
ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాలు వేయడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చునని పేర్కొంది. ఇప్పటికే పరిశోధకులు దాదాపు 6లక్షల టీకాలు వేసిన వ్యక్తుల నుండి డేటాను సేకరించారు. వ్యాక్సిన్ పొందని ఇతర వ్యక్తుల గ్రూపులతో డేటాను పోల్చారు. టీకా రెండు మోతాదుల తర్వాత, వైరస్ వ్యాప్తిని నివారించడంలో 92శాతం వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని తేలింది. కరోనా సోకినవారిలో కోవిడ్-19 లక్షణాలను సైతం 92శాతం సమర్థవంతంగా నివారించగలదని రుజువైంది. 92శాతం తీవ్రమైన కరోనా నుంచి రక్షించడమే కాదు.. 87శాతం ఆసుపత్రిలో చేరే అవసరం ఉండదని అధ్యయనంలో రుజువైంది. 44వేల మందిపై చివరి దశ అధ్యయనంలో ఫైజర్ బయోఎంటెక్ టీకా ఫలితాలతో పోల్చారు.

ఈ టీకా COVID-19 ముప్పును తగ్గిస్తుందని రుజువైంది. మరోవైపు టీకాలపై ప్రజల్లో అనేక అపోహాలకు దారితీస్తోంది. చాలామంది ప్రజలు టీకా వేయించుకోనేందుకు ముందుకు రావడం లేదు. వారిలోని భయాన్ని అయిష్టత పోయి వారికి వారే స్వచ్ఛందంగా టీకాలను వేయించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఒక టీకా వైరస్ నుంచి ఎంతకాలం రక్షణ ఇవ్వగలదు అనేదానిపై కూడా ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. సాధారణంగా ఒక టీకా మూడు నెలలు లేదా ఆరు నెలలు ఎంతకాలం ఉంటుందో కచ్చితంగా చెప్నలేమంటున్నారు. వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీల స్థాయిలు ఎంతకాలం ఉంటాయో తెలియాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.