కరోనా​ ఆసుపత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

కరోనా​ ఆసుపత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

CSIR-CCMB study కొవిడ్‌ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో క‌రోనా వైర‌స్ ఉన్నట్లు CSIR-CCMB అధ్యయనంలో తేలింది. కొవిడ్ బాధితులు ఉండే స‌మ‌యం మేరకు గాలిలో వైర‌స్‌ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైద‌రాబాద్‌, పంజాబ్ లోని మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడినట్లు సీసీఎంబీ(Centre for Cellular & Molecular Biology)తెలిపింది.

ఒకరు లేదా అంతకంటే ఎక్కువ కరోనా రోగులు తక్కువ సమయం గడిపి వెళ్లిన క్లోజ్డ్ రూమ్స్ ప్రయోగాల్లో…ముగ్గురు రోగ లక్షణాలు ఉన్న పేషెంట్లు గది నుంచి వెళ్లిన వెంటనే ఒక శాంపిల్ సేకరించామని..ఫలితం పాజిటివ్ గా వచ్చిందని ఈ అధ్యయనంలో తెలిపారు. ఈ అధ్యయనం.. medRxiv లో ప్రచురించబడింది.

క్రాస్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి హాస్పిటల్ ఏరియాలను కోవిడ్ మరియు నాన్ కోవిడ్ ఏరియాలుగా విభజించడం విజయవంతమైన వ్యూహమని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. అయితే, తటస్థ పర్యావరణ పరిస్థితులలో… వైరస్ రోగుల నుండి దూరంగా వ్యాపించినట్లు కనిపించడం లేదని ఈ అధ్యయనంలో తెలిపారు.

మంగళవారం సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ… రెండు నగరాల్లోని ఆసుపత్రులలోని వివిధ ఆవరణల నుండి సేకరించిన గాలి నమూనాలను విశ్లేషించాము. కరోనా పాజిటివ్ వ్యక్తులతో క్లోజ్డ్ రూమ్ ప్రయోగాలు చేసాము. వివిధ ఆసుపత్రులలోని కోవిడ్ మరియు నాన్ కోవిడ్ ప్రాంతాల నుండి 64 గాలి శాంపిల్స్ ను మరియు కోవిడ్ రోగులు ఆక్రమించిన మూసివేసిన గదుల నుండి 17 శాంపిల్స్ ను సేకరించాము. కోవిడ్ రక్షణ ప్రాంతాల నుండి సేకరించిన నాలుగు శాంపిల్స్ ఫలితం కరోనా పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు.