కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు కిటకిట.. 88 శాతం నిండిన ఐసీయూ బెడ్స్

  • Published By: sreehari ,Published On : November 16, 2020 / 07:06 AM IST
కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు కిటకిట.. 88 శాతం నిండిన ఐసీయూ బెడ్స్

Covid care facilities

Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి.



తీవ్ర లక్షణాలతో ఐసీయూల్లో చేరే కరోనా పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఢిల్లీలో 99 ఆస్పత్రుల్లో 88 శాతం ఐసీయూల్లో వెంటిలేటర్లు ఫుల్ అయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ కరోనా యాప్ డేటాలో కరోనా పేషెంట్లతో ఆస్పత్రుల్లోని ఐసీయూలు నిండిపోయినట్టు కనిపిస్తోంది.



https://10tv.in/corona-virus-face-masks-are-exacerbating-the-problem-of-waste-on-earth/
కొన్ని ప్రభుత్వ సదుపాయాలతో పాటు ఐసీయూల్లో వెంటిలేటర్ బెడ్స్ ఖాళీ లేక కిటకిటలాడి పోతున్నాయి. దీనికి సంబంధించి ఆదివారమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్ డీఆర్డీఓ కేంద్రంలో 750 ఐసీయూ బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.



రోజువారీ కరోనా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన BiPAP మిషన్లను మరిన్ని పెంచుతామని షా హామీ ఇచ్చారు. ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు లక్ష నుంచి 1.25 లక్షల మేర నమోదవుతున్నాయి. ఒక్క ఆదివారమే 3,235 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 26 నుంచి తక్కువ స్థాయిలో నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 4,85,405కు చేరింది.