Diet Drinks : డైట్ డ్రింక్ కూడా.. మామూలు డ్రింక్ లాంటిదే.. కుర్రోళ్ల ఆరోగ్యానికి ముప్పే

ఆరోగ్యానికి మంచిదని డైట్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? ఇక షుగర్ వచ్చే ప్రమాదం లేదని ఆనందపడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మరీ ముఖ్యంగా కుర్రోళ్లు జాగ్రత్తగా ఉండాలి.

Diet Drinks : డైట్ డ్రింక్ కూడా.. మామూలు డ్రింక్ లాంటిదే.. కుర్రోళ్ల ఆరోగ్యానికి ముప్పే

Diet Drinks

Diet Drinks Dying Young : ఆరోగ్యానికి మంచిదని డైట్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? ఇక షుగర్ వచ్చే ప్రమాదం లేదని ఆనందపడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మరీ ముఖ్యంగా కుర్రోళ్లు జాగ్రత్తగా ఉండాలి. చనిపోయే రిస్క్ వారిలో ఎక్కువగా ఉంది. ఓ కొత్త స్టడీలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఆర్టిఫీషియల్ గా స్వీటెన్ చేసిన డ్రింక్స్ తాగడం వల్ల యువకుల్లో మరణించే ముప్పు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. గుండె సంబంధం జబ్బులతో చనిపోతారని అధ్యయనకర్తలు కనుగొన్నారు.

చైనాలోని జెంగ్ ఝౌ యూనివర్సిటీ నిపుణులు 1.2 మిలియన్ అడల్ట్స్ పై 20ఏళ్లకు పైగా రీసెర్చ్ చేస్తున్నారు. వారి తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ పై స్టడీ చేశారు. అలా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటున్న వారిలో లక్షా 37వేల 310 మంది చనిపోయినట్టు గుర్తించారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది ప్రతి రోజూ 250ఎంఎల్ స్వీటెన్డ్ డ్రింక్ తాగారు.

షుగర్ స్వీటెన్డ్ డ్రింక్స్ తాగవం వల్ల మరణించే ముప్పు 5శాతం పెరగుతుందని జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లీడ్ స్టడీ హెడ్ డాక్టర్ హోంగీ తెలిపారు. గుండె జబ్బులతో మరణం సంబంధించే ప్రమాదం 13శాతం అధికంగా ఉందన్నారు.

షుగర్ స్వీటెన్డ్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో 12శాతం మంది పలు ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారు. ఈ డ్రింక్స్ తక్కువగా తాగేవారిలో 20శాతం మంది గుండె సంబంధ జబ్బులతో చనిపోతున్నారు.

”ఆర్టిఫిషియల్ గా చేసిన స్వీటెన్డ్ బెవరేజస్, షుగర్ స్వీటెన్డ్ బెవరేజస్ ఎక్కువగా తాగేవారిలో గుండె సంబంధ సమస్యలు అధికంగా వచ్చి చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది” అని డాక్టర్ హోంగీ లీ చెప్పారు. కృతమంగా చేసిన స్వీటెన్డ్ డ్రింక్స్ తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 4శాతం వరకు ఉందన్నారు. గుండె జబ్బులతో చనిపోయే రిస్క్ 7శాతం వరకు ఉందన్నారు.

డైట్ డ్రింక్స్ తాగడానికి బదులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే డైట్ డ్రింక్స్ తయారీదారుల వాదన మరోలా ఉంది. బ్యాలెన్స్ డైట్ తో సమానంగా తమ డ్రింక్స్ ఉంటాయని చెబుతున్నారు.

స్వీటెన్డ్ బెవరేజస్ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా జబ్బులు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా డైట్ డ్రింక్స్, గుండె జబ్బుల మధ్య సంబంధం ఉన్నట్టు గతంలో పలు అధ్యయనాల్లో బయటపడింది. కృతిమంగా తయారు చేసిన డ్రింక్స ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం కాదని అధ్యయనకర్తలు చెప్పారు. డ్రింక్స్ లో ఉండే షుగర్.. మన దేహంలోని అవయవాల్లో ఎక్కువ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందన్నారు. లివర్, ప్యాంక్రియస్ వంటి అవయవాల్లో కొవ్వు పేరుకుపోయి క్యాన్సర్ బారిన పడే ప్రమాదానికి దారి తీస్తుంది.

ఈ విషయాన్ని గ్రహించిన యూకే ప్రభుత్వం జాతీయ ఆరోగ్యాన్ని బూస్ట్ చేసేందుకు 2018 ఏప్రిల్ లో షుగర్ ట్యాక్స్ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. డ్రింక్స్ తయారు చేసే కంపెనీలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 100ఎంఎల్ డ్రింక్ లో 5గ్రాముల కన్నా షుగర్ ఎక్కువ ఉంటే 18పీ ట్యాక్స్ కట్టాలి. అదే 100ఎంఎల్ కి 8గ్రాముల షుగర్ ఉంటే 24పీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు షుగర్ స్వీటెన్డ్, కృతిమంగా తయారు చేసిన స్వీటెన్డ్ డ్రింక్స్ ను నివారించడం మేలని, దానికి బదులుగా మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెప్పారు.