Lack of sleep: 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే అధిక బరువు సమస్య.. పరిశోధనలో ఏం గుర్తించారంటే..?

ఈ పరిశోధనలో భాగంగా 1,229 మంది 10 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వారు నిద్రపోతున్న సమయాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. 12 ఏళ్ళ బయసు ఉన్న వారిలో 34 శాతం మంది మాత్రమే 8 గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు చెప్పారు. 14 ఏళ్ళ వయసు ఉన్నవారిలో 23 శాతం, 16 ఏళ్ళ వయసున్న వారిలో 19 శాతం మంది ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు తెలిపారు.

Lack of sleep: 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే అధిక బరువు సమస్య.. పరిశోధనలో ఏం గుర్తించారంటే..?

Lack of sleep

Lack of sleep: రాత్రి సమయంలో ఎనిమిది గంటల పాటు నిద్రపోయే టీనేజర్లతో పోల్చితే ఎనిమిది గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారికి బరువు పెరిగే ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. తక్కువ సమయం నిద్రపోయేవారు పొట్టభాగంలో కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, గ్లూకోజ్ స్థాయుల్లో నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురుకుంటున్నట్లు తేల్చామని చెప్పారు. ‘‘టీనేజర్లలో అధిక శాతం మంది తక్కువ సమయం నిద్రపోతున్నారు. ఈ కారణం వల్లే వారి శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుని బరువు పెరుగుతున్నారు. ఈ తీరు వారి భవిష్యత్తుకూ మంచిది కాదు’’ అని స్పెయిన్ పరిశోధకులు చెప్పారు.

బరువు పెరగడానికి, నిద్రకు సంబంధం ఉందని తమ పరిశోధన ద్వారా తెలిసిందని అన్నారు. ఈ పరిశోధనలో భాగంగా 1,229 మంది 10 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వారు నిద్రపోతున్న సమయాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. 12 ఏళ్ళ బయసు ఉన్న వారిలో 34 శాతం మంది మాత్రమే 8 గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు చెప్పారు. 14 ఏళ్ళ వయసు ఉన్నవారిలో 23 శాతం, 16 ఏళ్ళ వయసున్న వారిలో 19 శాతం మంది ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు తెలిపారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను చూస్తూ అధిక సమయం గడపడానికి, నిద్రలేమితో బాధపడడానికి ఏమైనా సంబంధం ఉందా? అన్న అంశంపై కూడా తాము పరిశోధన చేస్తున్నామని వివరించారు.