వామ్మో.. ఆ మహిళ మెదడులో ఎంత పెద్ద పురుగో చూశారా? డాక్టర్లే షాకయ్యారు!

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 07:55 PM IST
వామ్మో.. ఆ మహిళ మెదడులో ఎంత పెద్ద పురుగో చూశారా? డాక్టర్లే షాకయ్యారు!

tapeworm larvae : ఒక మహిళ మెదడులో చెంతాడంతా పెద్ద పురుగు (tapeworm larvae) జీవిస్తోంది.. ఈ పురుగును బయటకు తీసిన ఆస్ట్రేలియాలోనే డాక్టర్లే షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది 25ఏళ్ల barista అనే మహిళ. గత ఏడేళ్లుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతోంది. నెలలో మూడుసార్లు తీవ్ర స్థాయిలో తలనొప్పి వస్తుండేది. ఒకసారి తలనొప్పి వారానికి పైగా తీవ్రంగా బాధించింది.



అంతేకాదు.. కళ్లు మసకబారడం, తలనొప్పి కంటిన్యూగా వస్తూనే ఉంది. దాంతో భయపడిన మహిళ వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు మెదడులో ఏమైనా ట్యుమర్ ఉందేమోనని ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. మెదడులో ట్యుమర్ తొలగించేందుకు సర్జన్లు ప్రయత్నించారు. కానీ, మెదడులో అతిపెద్ద పురుగు లార్వాను చూడగానే షాక్ అయ్యారు.
Doctors shocked to find tapeworm larvae living in brain of woman who suffered migraines for yearsవెంటనే శస్త్ర చికిత్స ద్వారా మెదడులోని పురుగును బయటకు తీశారు. సాధారణంగా ఇలాంటి పురుగులు మనిషిలోని ప్రేగుల్లో జీవిస్తుంటాయి. సరిగా ఊడకించని పంది మాంసాన్ని తినడం ద్వారా ఈ పురుగు శరీరంలోకి ప్రవేశిస్తుంది. లేదంటే పురుగు (tapeworm) గుడ్లను తినడం ద్వారా కూడా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో neurocysticercosis (NCC) మొట్టమొదటి స్థానిక కేసుగా గుర్తించారు. ఎందుకంటే బాధిత మహిళ విదేశాలకు వెళ్లినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



లార్వా తిత్తులు మెదడులో ఏర్పడినప్పుడు Neurocysticercosis కారణంగా neurological సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం బాధిత మహిళ పూర్తిగా కోలుకుంది.. మరో ట్రీట్ మెంట్ అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా tapeworm ఇన్ఫెక్షన్ల కారణంగా మనుషుల్లోని మెదడు వంటి కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి మూర్ఛకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది.