కరోనా బాధితుల మెనూ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దోసె, గుడ్లు, ఆరెంజ్ పంపిణీ! 

  • Published By: sreehari ,Published On : March 18, 2020 / 06:49 AM IST
కరోనా బాధితుల మెనూ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దోసె, గుడ్లు, ఆరెంజ్ పంపిణీ! 

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. Covid-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ అవసరమైన నివారణ చర్యలు చేపడుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కూడా అందిస్తున్నారు. కరోనా అనుమానితులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.కరోనా బాధిత లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఆహారం, వసతి సౌకర్యాలను అందించడంలో ప్రభుత్వం వెనకాడటం లేదు.

కరోనా బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్తీ ఫుడ్ అందిస్తున్నారు. ప్రత్యేకించి కరోనా బాధితుల ఫుడ్ మెనూలో దోసె, సాంబార్, అరటిపండ్లు, నారింజలు, గుడ్లతో పాటు టీ కూడా అందిస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధితులందరికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే అధికారులు చర్యలు చేపట్టారు.

కేరళ కాలామస్సెరీ ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా బాధితులకు నారింజ, దోసె, సాంబర్, బ్రేక్ ఫాస్ట్ కోసం ప్యాకేజీ వాటర్ అందిస్తోంది. బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీసెజ్ (RGICD) ఆస్పత్రిలో కొవిడ్-19 బాధితులకు రాగిముద్దలు, అన్నం, కర్రీ, గుడ్లు, పెరుగు, అరటి పండ్లను మధ్యాహ్న భోజనం తర్వాత అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, అధికారులందరూ కరోనా వ్యాప్తిని నివారించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి.

పాజిటీవ్ తేలిన బాధితులకు సకాలంలో చికిత్స అందిస్తూ వారిపట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. యూరోపియన్ దేశాల్లో ఇటలీ, యూనైటెడ్ కింగ్ డమ్, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు కూడా సంభవించాయి. కరోనా వ్యాప్తిని అదుపుచేసేందుకు భారత్‌ సమర్థవంతంగా పోరాడుతోంది.

See Also | కరోనాపై కేరళ ఫైట్.. జైల్లో ఖైదీలతో మాస్క్‌ల తయారీ, ఇంటికే మధ్యాహ్న భోజనం!