‘హ్యూమన్ ఛాలెంజ్’ ట్రయల్స్‌లో డజన్ల కొద్దీ కావాలనే కరోనావైరస్ బారిన పడతారు!

  • Published By: sreehari ,Published On : October 20, 2020 / 09:22 PM IST
‘హ్యూమన్ ఛాలెంజ్’ ట్రయల్స్‌లో డజన్ల కొద్దీ కావాలనే కరోనావైరస్ బారిన పడతారు!

UK human challenge trials : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం అనేక ట్రయల్స్ జరుగుతున్నాయి. యూకేలో మొదటి ‘హ్యుమన్ ఛాలెంజ్’ ట్రయల్ అక్టోబర్ 20న ప్రకటించారు.

యూకే ప్రభుత్వం సహా ఒక కంపెనీ ఇలాంటి అధ్యయనాలను నిర్వహించేందుకు ఈ ట్రయల్‌ను ఏర్పాటుచేస్తోంది. దీనికి తుది నియంత్రణ, నైతిక ఆమోదం లభిస్తే.. వచ్చే జనవరిలో లండన్ ఆస్పత్రిలో ఈ ‘హ్యుమన్ ఛాలెంజ్’ ట్రయల్ ప్రారంభం కానుంది.



ఈ ట్రయల్స్‌లో పాల్గొనే యువత, ఆరోగ్యవంతులు ఉద్దేశపూర్వకంగా COVID-19 వైరస్‌ బారనపడబోతున్నారంట.. మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ ట్రయల్ లక్ష్యమని నివేదిక వెల్లడించింది. హ్యుమన్ ఛాలెంజ్ ట్రయల్స్‌కు మలేరియా, ఇన్ఫ్లుఎంజా వంటి వ్యాధుల చరిత్ర ఆధారంగా నిర్వహించనున్నారు.



భవిష్యత్తులో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాడే SARS-CoV-2 వైరస్ తగిన మోతాదును గుర్తించడానికి UK ట్రయల్ ప్రయత్నిస్తోంది. SARS-CoV-2 నిర్మూలనకు తక్కువ నిరూపితమైన చికిత్సలతో ఉద్దేశపూర్వకంగా ప్రజలకు వైరస్ సంక్రమించే అవకాశం ఉంది.

COVID-19 ఛాలెంజ్ ట్రయల్స్ సురక్షితంగా, నైతికంగా అమలు చేయాలని కొందరు వాదిస్తున్నారు. కానీ ఇతరులు ఈ అధ్యయనాల భద్రతావిలువపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మోతాదు పరీక్ష (డోస్ టెస్టింగ్) :
COVID-19 ఛాలెంజ్ అధ్యయనానికి ఒక ప్లానింగ్ ప్రకారం.. డబ్లిన్ ఆధారిత వాణిజ్య క్లినికల్-రీసెర్చ్ సంస్థ Open Orphan, దాని అనుబంధ సంస్థ HVIVO నేతృత్వం వహించనుంది. శ్వాసకోశ వ్యాధికారకాలపై ఛాలెంజ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.

ఉత్తర లండన్‌లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్ ఉన్నత-స్థాయి ఐసోలేషన్ యూనిట్‌లో జరుగుతుందని Open Orphan ఎగ్జిక్యూటివ్ చైర్మన్ Cathal Friel చెప్పారు.

ఈ ట్రయల్ నిర్వహించడానికి UK ప్రభుత్వ COVID-19 వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ సంస్థకు 10 మిలియన్ పౌండ్లు (13 మిలియన్ల అమెరికా డాలర్లు) వరకు చెల్లించేందుకు అంగీకరించింది.



వ్యాక్సిన్లను పరీక్షలో ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో 30 నుంచి 50 మంది పాల్గొంటారు. వారిలో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దలకు మాత్రమే అనుమతి ఉంది.

ఈ ట్రయల్‌లో పాల్గొనేవారికి ఎలా పరిహారం చెల్లించాలో నైతిక సమీక్ష బోర్డు నిర్ణయిస్తుంది. Open Orphan వాలంటీర్లకు 4,000 పౌండ్లు చెల్లిస్తుంది.

నైతిక సమస్యలు  :
COVID-19 ఛాలెంజ్ ట్రయల్స్ సురక్షితంగా నైతికంగా నిర్వహించవచ్చునని బయోఎథిసిస్ట్ Nir Eyal చెప్పారు.

వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పట్టించుకోకుండా వాలంటీర్లు డబ్బు కోసం పాల్గొంటారనే ఆందోళన కలిగిస్తోంది. వాలంటీర్లు ఛాలెంజ్ ట్రయల్స్ పరిమితులను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు.



మూడవ దశ ట్రయల్స్ వృద్ధులలో వ్యాక్సిన్లు పనిచేస్తాయనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. వైరస్ బారిన పడటానికి ముందు కరోనా వ్యాక్సిన్లకు వారి రోగనిరోధక వ్యవస్థలు ఎలా స్పందిస్తాయో పరిశోధకులు వృద్ధులలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది.

ఫీల్డ్ ట్రయల్స్‌తో పోల్చితే.. టీకా పని చేస్తుందో లేదో అంచనా వేసే రోగనిరోధక ప్రతిస్పందనలను గుర్తించడంలో ఛాలెంజ్ స్టడీస్ అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర ట్రయల్స్ డేటా :
COVID-19 ఛాలెంజ్ ట్రయల్స్‌ నిర్వహించే దేశం యూకే మాత్రమే కాదు.. ఈ ట్రయల్స్ సౌకర్యాల కోసం బెల్జియం ప్రభుత్వం 20 మిలియన్ పౌండ్లు (23.6 మిలియన్ అమెరికా డాలర్లు) వెచ్చిస్తోంది.

ఒక ల్యాబరేటరీ ద్వారా రెండు SARS-CoV-2 ఛాలెంజ్ జాతుల అభివృద్ధికి NIAID నిధులు అందించనుంది.



COVID-19 ఛాలెంజ్ ట్రయల్స్‌పై నిర్ణయాలు తీసుకునే ముందు మూడో దశ అధ్యయనాల డేటా అవసరమని NIAID తెలిపింది.

COVID-19 వ్యాక్సిన్ల అభివృద్ధిని ఒక నెలలో వేగవంతం చేస్తే.. 720,000 ఏళ్ల జీవిత నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. అలాగే 40 మిలియన్ ఏళ్ల పేదరికాన్ని కూడా నివారించవచ్చని చెబుతున్నారు.