కరోనా కట్టడికి మాస్క్ సరిపోదు…కళ్లజోడూ వాడండి….

  • Published By: sreehari ,Published On : July 30, 2020 / 08:57 PM IST
కరోనా కట్టడికి మాస్క్ సరిపోదు…కళ్లజోడూ వాడండి….

కరోనాను నిరోధించాలంటే కేవలం మాస్క్ పెట్టుకుంటే సరిపోదంటున్నారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ.. ముఖానికి మాస్క్ తో పాటు తప్పనిసరిగా కళ్లకు జోడు ధరించాలని అంటున్నారు. మాస్క్ కరోనా బారినుంచి రక్షించినప్పటికీ కళ్లు వైరస్ కు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Dr. Fauci, Wear goggles or eye shields to prevent spread of COVID-19; flu vaccine a must

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు కరోనా సోకకుండా నివారించేందుకు అమెరికన్లు గాగుల్స్ లేదా ఫేస్ షీల్డ్ ధరించాలని ఆంథోనీ ఫౌసీ సూచించారు. మీకు గాగుల్స్ లేదా కంటి కవచం (ఐ షీల్డ్) ఉపయోగించాలని సూచిస్తున్నారు. మీ ముక్కులో శ్లేష్మం ఉన్నట్టే.. నోటిలోనూ శ్లేష్మం ఉంటుంది… అలాగే మీ కంటిలోనూ శ్లేష్మం కూడా ఉంటుందని ఆయన అన్నారు.



సిద్ధాంతపరంగా పరిశీలిస్తే.. మీరు అన్ని శ్లేష్మ ఉపరితలాలను వైరస్ బారి నుంచి రక్షించాలంటే.. గాగుల్స్ లేదా కంటి కవచం ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో గాగుల్స్, కంటి లేదా ఫేస్ షీల్డ్స్ పెద్దగా సిఫరసు చేయడం లేదని అన్నారు. మీకు వీలైతే వీటిని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 662,000 మందిని బలితీసుకుంది.



ప్రపంచవ్యాప్తంగా 16.8 మిలియన్లకు పైగా ప్రజలు COVID-19 బారిన పడ్డారు. ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్ అత్యధికంగా ప్రభావితమైన దేశంగా 4.3 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 150,000 మందికి పైగా మరణించారు. ఓహియో, టేనస్సీ, కెంటుకీ ఇండియానా నాలుగు రాష్ట్రాలను ఫౌసీ ఉద్దేశించి ప్రసంగించారు. ఒహియో, టేనస్సీ, కెంటుకీ, ఇండియానాలో ఎక్కువ శాతం మంది కరోనా బారినపడ్డారని చెప్పారు.



వైరస్ సోకిందా? టెస్టు ఎప్పుడు అవసరమంటే? :
వైరస్ బారిన పడ్డారని భావిస్తే.. COVID-19 ఎప్పుడు టెస్టులో కూడా ఫౌసీ చర్చించారు. ఎందుకంటే ఎప్పుడు పరీక్షించాలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి అధికారిక మార్గదర్శకాలు లేవు. ఐదు రోజులు మంచిదని తాను అనుకుంటున్నానని చెప్పారు. ఎందుకంటే మీకు లక్షణాలు వచ్చినప్పుడు ఇంక్యుబేషన్ పిరియడ్ ఐదు రోజుల వరకు ఉంటుంది.

ఫ్లూ సీజన్‌పై ఫౌసీ వివరణ :
రాబోయే ఫ్లూ సీజన్ గురించి కూడా ఫౌసీ చర్చించారు. మాస్క్ లు ధరించడం వల్ల ఇన్ఫ్లుఎంజా వ్యాప్తిని పరిమితం చేయవచ్చని భావిస్తున్నట్లు ఫౌసీ చెప్పారు. మాకు కొంతవరకు ఫ్లూ రావడం అనివార్యమన్నారు. మాస్క్, ఇతర కవరింగ్‌లు ధరించడం COVID-19 నుంచి సురక్షితంగా ఉండేలా చూస్తోంది. ఇన్ఫ్లుఎంజా నుండి మమ్మల్ని రక్షించడంలో సాయపడుతుందని ఆశిస్తున్నానని అన్నారు. కరోనా ఫ్లూ లక్షణాలు చాలా ఒకేలా ఉంటాయని అందుకే గందరగోళానికి గురిచేస్తాయని ఆయన అన్నారు. ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు వెంటనే పొందాలని ఫాసీ సూచించారు.