ప్రతి సంవత్సరం COVID-19 వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే..

ప్రతి సంవత్సరం COVID-19 వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే..

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో ఆ వచ్చే వ్యాక్సిన్‌ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎవ్వరైనా కానీ వ్యాక్సిన్‌ అంటే జీవితాంతం పనిచేస్తుందని అనుకుంటాం. కానీ COVID-19 విషయంలో ఈ అభిప్రాయం మారిపోయింది. అత్యంత వేగంగా రూపాంతరం చెందే లక్షణం ఉండటమే ఇందుకు కారణం.



ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కు కూడా 1930లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే. 1990 తర్వాతే అన్ని దేశాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ఓసారి తీసుకుంటే ఇక జీవితాంతం ఫ్లూ బారిన పడకుండా ఉండొచ్చనే నమ్మకం లేకుండా పోయింది. ఈ ఫ్లూ వైరస్‌ అత్యంత వేగంగా మార్పు చెందుతుండటంతో ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను అందుకు తగ్గట్టుగా మార్పు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.



ఈ నేపథ్యంలో COVID-19కు అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్‌ కూడా ఇలా తరచూ వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. వైరస్‌ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు. అప్పుడు వ్యాక్సిన్‌లో మార్పులు అవసరమవుతాయి అని తెలుస్తుంద