తరచూ శృంగారంలో పాల్గొనేవారిలో ఈ సమస్య ఎక్కువ!

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 03:03 PM IST
తరచూ శృంగారంలో పాల్గొనేవారిలో ఈ సమస్య ఎక్కువ!

తరచూ లైంగిక చర్యలో పాల్గొనే మహిళల్లో రుతుక్రమం ఆలస్యం అవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనని అదే వయస్సు ఉన్న మహిళలతో పోలిస్తే.. తరచూ పాల్గొనేవారిలోనే మెనోపాజ్ సమస్య అధికంగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఒక నెలలో ఒకసారి కంటే తక్కువ సార్లు లైంగిక చర్యలో పాల్గొన్న మహిళలతో పోలిస్తే.. సగటున వారంలో కనీసం ఒకసారైనా లైంగికంగా కలిసివారిలో మెనోపాజ్‌లోకి వచ్చే అవకాశాలను 28 శాతం తగ్గించాయని రీసెర్చర్లు జనరల్ రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ రిపోర్టులో నివేదించారు. 

ఆ మార్పులతోనే ఆలస్యం :
ఈ రెండింటీకి మధ్య వ్యత్సాసాన్ని ప్రస్తావిస్తూ.. పరిణామ ఒత్తిళ్ల కారణంగా శరీరంలో జరిగే మార్పులతోనే ఈ సమస్య ఏర్పడుతుందని అధ్యయనం సూచిస్తోంది. ‘మధ్య వయస్సు వచ్చేసరికి అరుదుగా లేదా తక్కువ సార్లు లైంగిక సంబంధ కల్గి ఉంటే..  అప్పుడు వారి శరీరంలో గర్భం దాల్చే సూచనలేమి కనిపించవు’ అని లండన్ యూనివర్శిటీ కాలేజ్ శాస్త్రవేత్తల్లో మేఘన్ అర్నోట్, రౌత్ మేస్ తెలిపారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. అండోత్పాదన కొనసాగించడం కంటే.. స్త్రీ తన సంతానోత్పత్తిని నిలిపివేసి, శరీరానికి కావాల్సినంత శక్తిని పునరుత్పత్తి అయ్యేలా చేయడమే మంచిదని అంటున్నారు. 

పెళ్లికానివారు లేదా విడాకులు తీసుకున్న మహిళల్లో కంటే వివాహితలే ఎందుకు ముందుగా మెనోపాజ్ చేరుకుంటారు అనేదానిపై ఇటీవల చేసిన పరిశోధన వివరణ ఇస్తోంది. అదే జంతువుల్లో సహజ రసాయనాల్లో వ్యతిరేక లైంగిక చర్యను ఆకర్షిస్తాయి. ఈ సిద్ధాంత పరంగా నీటి పరిమాణం ఉందో లేదో తెలుసుకునేందుకు 1996, 1997లో అమెరికాలోని దాదాపు 3వేల మంది మహిళల డేటాను అర్నోట్, మేస్ పరీక్షించారు.

SWAN అనే ప్రాజెక్టులో మెనోపాజ్‌తో పాటు జీవ, మానసిక స్థితికి సంబంధించి డేటాను సేకరించి మార్పులను ట్రాక్ చేసేలా డిజైన్ చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనేందుకు వెళ్లిన మహిళల సగటున 46 ఏళ్ల వయస్సు కాగా, వీరిలో ఎవరూ మెనోపాజ్‌కు చేరుకోలేదు. కానీ, ప్రారంభ దశలో వీరిలో చిన్నపాటి మెనోపాజ్ లక్షణాలు కనిపించినట్టు తెలిపింది. 

తర్వాతి దశాబ్ద కాలంలో 45 శాతం మంది మహిళలు సహజ మెనోపాజ్ కు చేరుకోగా వారిలో సగటున మహిళల వయస్సు 52ఏళ్లుగా ఉంది. ఇక అధ్యయనంలోకి వెళ్తే.. దాదాపు 78 శాతం మహిళలు వివాహితలు లేదా పురుషునితో సంబంధం కలిగి ఉన్నవారు, భాగస్వాములతో కలిసి ఉన్నవారు 68శాతంగా ఉన్నారు. లైంగిక చర్య ప్రీక్వెన్సీ, మెనోపాజ్ కు మధ్య పరస్పర సంబంధం అనేది స్పష్టంగా లేదని రీసెర్చర్లు కనుగొన్నారు.

 లైంగిక సంబంధాలన్నీ భిన్న లైంగిక సంబంధాలని, స్వలింగ చర్యలు ఇలాంటి ప్రభావాన్ని చూపుతాయో లేదో తెలియదు. అంతేకాదు.. పురుషుల సమక్షంలో జీవించే మహిళల్లో, మగవారి నుంచి విడుదలయ్యే రసాయన సంకేతాల మధ్య ఎటువంటి సంబంధం కనిపించలేదు. ఫేర్మోన్ పరికల్పనకు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పరిశోధకులు తేల్చేశారు.