Water Good For Health : రోజుకు 8గ్లాసుల నీరు ఆరోగ్యానికి మంచిదంటున్న నిపుణులు! ఏయే సమయాల్లో, ఎలా తీసుకోవాలో తెలుసా?

శరీరానికి రోజుకు సరిపడినంత నీరు అందించటం వల్ల జీర్ణ క్రియ, మెదడు పనితీరుతో పాటు శక్తిస్ధాయిలు పెరుగుతాయి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం రోజులో 8 గ్లాసుల నీరు తీసుకోవటం ఉత్తమమైన మార్గం.

Water Good For Health : రోజుకు 8గ్లాసుల నీరు ఆరోగ్యానికి మంచిదంటున్న నిపుణులు! ఏయే సమయాల్లో, ఎలా తీసుకోవాలో తెలుసా?

8 glasses of water

Water Good For Health : మానవ మనుగడకు నీరు అనేది అతి ముఖ్యమనది. మనషి శరీరంలో 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. ప్రతిరోజు మన శరీరానికి నీటి అవసర ఉంటుంది. నీరు లేకపోతే అనేక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితానికి నీరు అమృతంతో సమానం. అలాంటి అమృతాన్ని రోజు వారిగా సరిపడినంత మోతాదులో శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది. శరీరానికి రోజుకు సరిపడినంత నీరు అందించటం వల్ల జీర్ణ క్రియ, మెదడు పనితీరుతో పాటు శక్తిస్ధాయిలు పెరుగుతాయి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం రోజులో 8 గ్లాసుల నీరు తీసుకోవటం ఉత్తమమైన మార్గం.

రోజులో 8గ్లాసుల నీటిని ఏయే సమయాల్లో సేవించాలి ;

శరీరంలోని అవయవాలు రోజు వారి దినచర్యలకు నీటి అవసరాలను సందర్భాన్ని బట్టీ కోరుకుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని ప్రకారం నీరు సేవించే షెడ్యూల్ ను రూపొందించుకోవాలి.

మొదటి గ్లాసు నీరు ; ఉదయం 7గంటల సమయంలో మొదటి గ్లాసు నీరు తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవటానికి ముందు డీ హైడ్రేషన్ లేకుండా ఉండాలంటే నీరు తీసుకోవటం మంచిది. ఇందుకుగాను గోరు వెచ్చని నీటిని ఉపయోగించటం మంచిది. ఉదయాన్నే నీరు తాగటం చాలా మందికి నచ్చదు. కడుపులో తిప్పినట్లు ఉంటుంది. అలాంటి సందర్భంలో నీటిలో నిమ్మరం, తేనె కలుపుకుని తీసుకోవచ్చు.

రెండవ గ్లాసు నీరు ; ఉదయం అల్పాహారం పూర్తయిన గంట తరువాత రెండవ గ్లాసు నీరు తీసుకోవాలి. ఈ నీరు తీసుకున్న అల్పాహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది.

మూడవ గ్లాసు నీరు ; మధ్యాహ్నం భోజనానికి సరిగ్గా గంట ముందు ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. భోజనానికి ముందు నీరు తాగటం వల్ల తీసుకున్న భోజనం సంతృప్తిని కలిగించేలా దోహదం చేస్తుంది. అంతేకాకుండా బరువు పెరగకుండా చూస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో దాహం వేస్తే కొద్దిపాటి నీరును సేవించవచ్చు.

నాల్గవ గ్లాసు నీరు ; మధ్యాహ్నం భోజనం చేసిన గంట తరువాత ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం తాలూకా పోషకాలు శరీరం గ్రహించటానికి అవకాశం ఉంటుంది.

ఐదవ గ్లాసు నీరు ; సాయంత్రం సమయంలో ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. చాలా మంది సరిగ్గా 4 నుండి 5 గంటల సమయంలో టీ తాగాలనుకుంటారు. అయితే టీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తీసుకోవాలి.

ఆరవ గ్లాసు నీరు ; రాత్రి భోజనానికి గంట ముందుగా ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. అంటే 6గంటల సమయంలో తీసుకుంటే సరిపోతుంది. ఈ నీరు పొట్ట నిండిన భావన కలిగించి రాత్రి సమయంలో ఎక్కవ మోతాదులో ఆహారం తీసుకోకుండా నివారించేందుకు తోడ్పడుతుంది. దీని వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు.

ఏడవ గ్లాసు నీరు ; రాత్రి భోజనం చేసిన తరువాత ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఈనీరు తీసుకున్న ఆహారం జీర్ణఅయ్యేందుకు సహాయపడుతుంది.

ఎనిమిదవ గ్లాసు నీరు ; చివరిగా నిద్రకు ఉపక్రమించబోయే ముందుగా ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. రాత్రి డీహైడ్రేషన్ ను ఈనీరు దూరం చేస్తుంది. మనస్సుకు ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

రోజులో ఎనిమిది గ్లాసులు మాత్రమే తాగాలన్న లెక్క ఏమీలేక పోయినప్పటికీ నీటితోపాటు ఇతర ఫ్రూట్ జ్యూస్ ల రూపంలో కూడా తీసుకోవచ్చు. దాహం వేస్తే ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమ పనితీరుకు నీరు అత్యవసరం అన్న విషయం మరువకుండా రోజువారిగా కనీసం 8 గ్లాసుల నీరు తాగటం తప్పనిసరన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవటం మంచిది.