కరోనా కట్టడికి ఐసోలేషన్ ఆయుధం.. తెలంగాణ బాటలో మిగిలిన రాష్ట్రాలు

  • Published By: sreehari ,Published On : March 20, 2020 / 10:00 AM IST
కరోనా కట్టడికి ఐసోలేషన్ ఆయుధం.. తెలంగాణ బాటలో మిగిలిన రాష్ట్రాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. కరోనా అనుమానితులను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు తక్షణ వైద్యసదుపాయాలపై దృష్టిసారించాయి. పనికిరాని భవనాలను మరమ్మత్తులు చేయడం ద్వారా లేదా ఇప్పటికే ఉన్న వాటిని మార్చడం ద్వారా కోవిడ్ -19 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాయి. ముందుగా నిర్మించిన ఫ్రాబ్రికేటెడ్ నిర్మాణాలను ఉపయోగించి ఆస్పత్రులను నిర్మించిన చైనా సామర్థ్యంతో పోల్చితే ఈ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధితో పోరాడటానికి ఈ ప్రయత్నాలు ఎంతో కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. 

అందులో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ప్రభుత్వం ముందుంజలో కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య మౌలికసదుపాయాల బలహీనంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానాస్పద కేసులను వేరు చేసి చికిత్స అందేలా ప్రయత్నిస్తోంది.

గాంధీ ఆసుపత్రిలో ఈ సదుపాయాన్ని పరిశీలించిన అనంతరం సాధారణ రోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని గుర్తించిన తరువాత ఈ చర్యను అమలు చేస్తోంది. కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ ఆస్పత్రుల వార్డులను ఏర్పాటు చేస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం మొదటిది.

ఆ తర్వాత మహారాష్ట్రలో, సెవెన్ హిల్స్ హాస్పిటల్ మొత్తం అంతస్తును అధికారులు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల సహాయంతో ఐసోలేషన్ వార్డుగా మారుస్తున్నారు. కర్నాటకలో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నారాయణ హెల్త్ కు సంబంధించి  కోవిడ్ -19 బాధితుల కోసం 700 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఖాళీ చేస్తే వైద్య సౌకర్యాలు వంటి వనరులను అందిస్తామని తెలిపినట్టు బిజినెస్ స్టాండెర్డ్ నివేదించింది. 

కోవిడ్ -19 వ్యాప్తితో భారతదేశంలో బలహీనమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 1,000 జనాభాకు 1 కంటే తక్కువ ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉన్నట్టు తేలింది. OECD ప్రకారం దేశంలో 1,000 మందికి 0.5 ఆసుపత్రి పడకలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని పలు ఆస్పత్రులు ఎలిక్టివ్ సర్జరీలను రద్దు చేయాలని, అవుట్-పేషెంట్ టైమింగ్‌ను తగ్గించాలని, వ్యాధి ప్రసార అవకాశాలను తగ్గించడంతో పాటు కోవిడ్ -19 బాధితుల సంరక్షణ కోసం వైద్యులు అందుబాటులో ఉండేలా నిర్ణయించాయి.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల పరిస్థితి భయంకరంగా ఉంది. లక్ష మందికి దేశంలో 2.3 క్రిటికల్ కేర్ పడకలు ప్రధాన దేశాలలో అతి తక్కువ అని చెప్పవచ్చు. లక్షకు 12.5 క్లిష్టమైన సంరక్షణ పడకలు కలిగిన ఇటలీలో కరోనా వ్యాప్తి మధ్య మరింత ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అనుకోకుండా కాదు. భారత జిడిపిలో 1.4% పైగా ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా జిడిపిలో 8% పైగా ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తోంది.

See Also | 10వేలు దాటిన కరోనా మృతులు…అలాగే జరిగితే భారత్ లో 30కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం