మొదటి కరోనా వ్యాక్సిన్లపై నమ్మకం పెట్టుకోవద్దు.. అంతగా వైరస్‌ను అడ్డుకోలేదు

  • Published By: sreehari ,Published On : October 30, 2020 / 03:15 PM IST
మొదటి కరోనా వ్యాక్సిన్లపై నమ్మకం పెట్టుకోవద్దు.. అంతగా వైరస్‌ను అడ్డుకోలేదు

First coronavirus vaccines : ప్రపంచాన్ని పీడుస్తున్న కరోనావైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా సమర్థవంతంగా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోలేవని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



మొదటి కరోనా వ్యాక్సిన్లు ప్రతిఒక్కరిపై పనిచేయకపోవచ్చునని అంటున్నారు. మొదటి కరోనా వ్యాక్సిన్ల సమర్థత పరిమితంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అభివృద్ధి చేసిన మొదట్లోనే ఏ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసిన చర్రిత లేదని ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో నివేదించారు.



ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సినేషన్ ఇవ్వడం ఒకటే సరైనదిగా యూకే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ Bingham తెలిపారు. మొదటి జనరేషన్ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చునని అన్నారు.



వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోలేవని, లక్షణాలను మాత్రమే తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరిలో దీర్ఘకాలం పాటు పనిచేయకపోవచ్చునని తెలిపారు. ఇప్పటివరకూ క్లినికల్‌గా ఏ వ్యాక్సిన్ కూడా కరోనా వ్యాక్సిన్ నిర్ధారణ కాలేదు.



45వేల మందికిపైగా బ్రిటన్లు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగా.. ఈ ఏడాది ఆఖరిలోగా చివరి దశ ట్రయల్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.