జాగ్రత్త.. స్మార్ట్ ఫోన్ తో గుండె జబ్బులు, డయాబెటిస్

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. చిన్న,

  • Published By: naveen ,Published On : June 1, 2020 / 09:07 AM IST
జాగ్రత్త.. స్మార్ట్ ఫోన్ తో గుండె జబ్బులు, డయాబెటిస్

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. చిన్న,

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. చిన్న, పెద్ద.. ధనిక, పేద.. అనే తేడా లేదు. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. చాటింగ్, బ్రౌజింగ్, గేమ్స్ అంటూ కొందరు గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా పర్లేదు కానీ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఏదైనా లిమిట్ లో ఉండాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలోనూ అంతే. మరీ ఎక్కువగా ఫోన్ వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వాటిని వాడితే ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్, కంటి సమస్యలు, నిద్రలేమి తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

స్మార్ట్ ఫోన్ తో ఒబెసిటీ:
కొలంబియాలోని సిమోన్ బొలివర్(simon bolivar) యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు 1060 మందిపై సైంటిస్టులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా తెలుసుకున్నారు. అన్నీ విశ్లేషించాక చివరకు తేలిందేమిటంటే.. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే అబ్బాయిలు స్థూలకాయం(ఒబెసిటీ) బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే అమ్మాయిలు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు.

ఒబెసిటీతో గుండె జబ్బులు, డయాబెటిస్:
అంటే స్మార్ట్‌ ఫోన్ వాడకం రోజులో 5 గంటలకు మించితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట. ఇదే స్థూలకాయం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు అంటే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా చాన్స్ ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ తెగ వాడేస్తున్నారు. ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ ఒకే చోట ఉండటం వల్ల ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పోతోంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. దీనికి తోడు నిద్రలేమి, కంటి సమస్యలు. స్మార్ట్‌ ఫోన్లు వాడటంలో తప్పు లేదు. కానీ ఏదైనా లిమిట్ లో ఉండాలి. దాన్ని క్రాస్ చేయడం మనకే ప్రమాదం. అవసరం ఉంటే తప్ప ఎక్కువ సేపు ఫోన్ వాడకపోవడమే మంచిది.

Read: లాక్‌డౌన్ టెన్షన్.. శృంగారంపై ఆసక్తిని చంపేస్తోంది.. సగానికి కంటే తక్కువ మంది రొమాన్స్ చేస్తున్నారంట…