ఫిట్‌గా ఉండటం కోసం మీరు చేయగలిగిన ఐదు చిట్కాలు

10TV Telugu News

రోజువారీ పనులు జరుగుతున్నాయిలే అంతా బాగానే ఉందనుకుంటే మనమే నష్టపోతాం. బిజీబిజీ జీవితాల్లో ఎదుర్కొనే మానసిక సమస్యలు, ఆహారపు అలవాట్లు శరీరాన్ని ప్రతిరోజూ ఎంతగా పాడుచేస్తాన్నాయో తెలుసుకోలేం. పరుగులు పెడుతూ ఆరోగ్యం గురించి, ఫిట్‌నెస్ గురించి పట్టించుకోవడం మానేశాం. నిజానికి దీని కోసం ఉదయాన్నే లేచి పరుగులు పెట్టడం, గంటలగంటలు జిమ్ లలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. 

డైలీ యోగా
ఆయుర్వేద వైద్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగాకే తొలి ప్రాధాన్యం దక్కింది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాలను ఆధీనంలో ఉంచుకోవచ్చు. అంతర్గత ఒత్తిడి పోవడానికి పలు రకాలైన యోగాసనాలు ఉపకరిస్తాయి. అదెంతసేపు చేయగలిగామనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. 

Five things you can do

నాలుక గీసుకోవాలి
ఉదయాన్నే కాస్త యోగా పూర్తి చేసుకుని నాలుకని కాపర్‌తో గీసుకోవాలి. కాపర్ యాంటీ బ్యాక్టీరియాతో ఉంటుంది. శరీరానికి యాంటీ బ్యాక్టీరియా అందించడంతో పాటు రాత్రి మొత్తం నాలుకపై పేరుకుపోయి ఉన్న చెత్తను బయటపడేలా చేస్తుంది. రుచి గ్రంథులు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 

Five not impossible things you can do

ఆరు ఆహారాల్లో ఏదో ఒకటి:
శరీరంలో దృఢత్వం పెరగడానికి ఈ ఆరు ఆహార పదార్థాల్లో ఒకటి కచ్చితంగా తీసుకోవాలి. ఆకుకూరలు, బీన్స్, సాఫ్ట్ వెన్న, నెయ్యి, కొత్తిమీర, ఎర్ర ఉల్లిపాయలు, చికెన్, సముద్ర చేపలు, బ్లూ బెర్రీస్ శరీరానికి చాలా మంచిది. వీటిల్లో రోజూ ఏదో ఒకటి తీసుకుంటుండటం ఆరోగ్యకరం. 

Five not impossible things you can do

కూరగాయలు తినడం
శరీరానికి ఎక్కువ శాతం కూరగాయలు తీసుకోవడం చాలా ఉత్తమం. వాటిలో కొన్నింటిని రోజూ తీసుకోకపోవడమే మంచిది. టమాటాలు, బంగాళదుంపలు అప్పుడప్పుడు తినడమే బెటర్. ఆయుర్వేదానికి సంబంధించి ఇదే ఆరోగ్యకరం.

Five not impossible things you can do

లివర్‌ని గమనిస్తూ ఉండండి
లివర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని డీ హైడ్రేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ పై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. డైలీ తిరిగే పరిసరాల్లో సమస్యలు ఎదురుకాకపోవచ్చు కానీ, ఏదైనా టూర్‌లు వెళ్లినప్పుడు ఆహార అలవాట్లు మారడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. 
 

Five not impossible things you can do