కరోనా నుంచి రక్షణగా హెల్మెట్

  • Published By: chvmurthy ,Published On : January 29, 2020 / 04:03 PM IST
కరోనా నుంచి రక్షణగా హెల్మెట్

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తున్నారు.  చైనాలో సుమారు 130 మంది దీని బారిన పడ్డారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.  

చైనాలోని షాంఘై నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నగరానికి బుధవారం ఉదయం  తొమ్మిదిన్నరకు వచ్చిన విమానంలో ప్రయాణికులందరిలోనూ కరోనా వైరస్‌ భయం కనిపించింది. వారంతా మూతికి, ముక్కుకు క్లినికల్‌ మాస్క్‌లు ధరించి రాగా, ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా తలకు మోటారు బైక్‌ హెల్మెట్‌ ధరించి వచ్చారు. అయినా వారిని వెంటనే విమానయాన సిబ్బంది కిందకు దిగనీయలేదు.

వైద్య సిబ్బంది వచ్చి వారి చుట్టూ వైరస్‌ నాశన మందును స్ప్రే చేసిన తర్వాతనే ప్రయాణికులను విమానం నుంచి దిగేందుకు అనుమతించారు. కొన్ని విమాన యాన సంస్ధలు విమాన ప్రయాణంలో ఇచ్చే కాఫీ,టీ, భోజనం వంటివాటిని రద్దు చేసింది. కొన్ని దేశాలు చైనాకు విమాన సర్వీసులను రద్దుచేశాయి. విమానం ప్రయాణంలో తన కొడుకు చికాకేసి పలుసార్లు మాస్క్‌ తీసివేసేందుకు ప్రయత్నించాడని, తాను అందుకు అవశాశం ఉండకుండా పక్కనే ఉండి జాగ్రత్త పడ్డానని జాన్‌ వూ అనే వ్యక్తి తెలిపారు.

చైనాలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య నాలుగున్నర వేల నుంచి ఆరు వేలకు హఠాత్తుగా పెరగడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. చైనా నుంచి ఆస్ట్రేలియా వచ్చిన ఆస్ట్రేలియన్లలో 16 మందికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానించి అధికారులు వారిని ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో ఉన్న మరో 600 మంది ఆస్ట్రేలియన్లను ఇంకా తమ దేశానికి తీసుకురావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Also Read : యువతిని రక్షించటానికి కారును ఎత్తిపడేశారు