ఫ్రిజ్‌లో ఇవి మాత్రం అస్సలు పెట్టకండి..

ఫ్రిజ్‌లో ఇవి మాత్రం అస్సలు పెట్టకండి..

Fridge Foods: తినే ప్రతి వస్తువును ఫ్రిజ్ లో పెట్టేస్తాం. బిజీ లైఫ్‌లో ఫుడ్ ఐటెంలు ప్రతిరోజు కొనాల్సిన పనిలేకుండా ఉండాలని వారంలో ఒకట్రెండు సార్లు మాత్రమే మార్కెట్‌కు వెళ్లి కావలసినవన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం. పాడవకూడదని ఫ్రిజ్ లో పెడతాం కానీ, అవి అలా రిఫ్రిజరేటర్ లో ఉంచొచ్చా లేదా అనేది పట్టించుకోం.

అలా అన్నింటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కొన్నింటిని ఫ్రిజ్‌లో దాచి ఉంచడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయి, అవి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరి ఫ్రిజ్‌లో పెట్టకూడనివి ఏంటో, వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరుగుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం రండి..

బంగాళదుంపలు
బంగాళదుంపలను అస్సలు ఫ్రిజ్‌లో దాచకూడదట. వీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల లోపలి భాగం త్వరగా తియ్యగా మారుతుందట. వీటిని ఉడికించుకుని లేదా ఫ్రై చేసుకుని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టమాటోలు
విటమిన్-సి, పొటాసియంతో పాటు ఇతర న్యుట్రియన్లు కలిగిన టామాటోలు రూం టెంపరేటర్‌లో ఉంచితే చాలట. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వీటి రూపంతో పాటు రుచి కూడా మారుతుంది. ఒకవేళ వాటిని అందులో పెట్టినా కూడా మనం వాడటానికి ఒకరోజు ముందే తీసి బయటపెట్టుకోవడం మరిచిపోకండి.

గుమ్మడికాయ
మంచి గుమ్మడికాయను ఫ్రిజ్‌లో దాచి ఉంచడం వల్ల లోపల ఉండే పదార్ధం పాడవుతుందట. వీటిని గదిలో చల్లని ప్రదేశంలో ఉంచితే చాలట.

అరటిపళ్లు
చాలా మంది కూరగాయలు, పళ్లన్నింటినీ ఫ్రిజ్‌లోనే పెడుతుంటాం కానీ.. అరటిపళ్లను ఫ్రిజ్‌లో దాయడం వల్ల అవి పాడైందే కాకుండా పక్కన ఉన్న ఇతర పళ్లను కూడా పాడుచేస్తాయట.

వెన్న
పాలు, పెరుగు, వెన్న లాంటి వాటిని మనం కచ్చితంగా రిఫ్రిజిరేటర్‌లో పెడుతుంటాం. అలా ఉంచడం వల్ల వెన్నలో ఉండే నీరు లేదా నూనె.. ఘనపదార్థంతో విడిపోతాయట. ఎక్కువ రోజులు ఉండేందుకు వెన్నను ఫ్రిజ్‌లో పెట్టుకున్నప్పటికీ.. మనం వాడటానికి ఒక రోజు ముందు బయట పెట్టుకోవడం మంచిదట.

బ్రెడ్
బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల చాలా రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. కానీ.. ఇలా చేయడం వల్ల బ్రెడ్‌లోని టేస్ట్ అంతా పోతుందట.

పుచ్చకాయ
పుచ్చకాయలు బయట ఉంచడం వల్ల వాటిలోని న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఫ్రిజ్‌లో దాచి పెట్టడం వల్ల.. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుందట. కట్ చేసిన పుచ్చకాయలు బయట ఉంచడం అస్సలు మంచిది కాదట.

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు ఎప్పుడూ పొడిగా ఉండే ప్రదేశంలో, చల్లటి, చీకటి వాతావరణంలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయట. అయితే.. పొట్టు తీసి, సగం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో పెట్టి వాడుకోవడానికి కాసేపు ముందు బయటకు తీస్తే మంచిదట.

సిట్రస్ ఫ్రూట్స్
వీటిని ఫ్రిజ్‌లో దాచి తినడం మంచిది కాదట. ఒకవేళ ఫ్రిజ్ లో దాచాలనుకుంటే… బయటకు తీసిన చాలా సేపటికి వాటిని తినాలట. వీటిని బయట కూడా ఎక్కువ రోజుల పాటు ఉంచడం మంచిది కాదట. మార్కెట్ నుంచి తెచ్చిన రెండు మూడు రోజుల్లో తినేయాలట.

తేనె
తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల సహజ గుణాన్ని కోల్పోయి గట్టిగా తయారవుతుంది