Height Matters : మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ 10 ఫుడ్ ఐటెమ్స్ కచ్చితంగా ఇవ్వండి

పిల్లలు ఎత్తుగా పెరగాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. మా పిల్లాడు పొట్టిగా ఉన్నాడు ఎత్తుగా పెరిగితే బాగుండు అని ఏదో ఒక సందర్భంలో అనుకోని వారుండరు. మరి పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలి? అందుకు మార్గం ఉందా? ఎలాంటి ఆహారం ఇస్తే హైట్ పెరుగుతారు?

Height Matters : మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ 10 ఫుడ్ ఐటెమ్స్ కచ్చితంగా ఇవ్వండి

Height Matters

Height Matters : పిల్లలు ఎత్తుగా పెరగాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. మా పిల్లాడు పొట్టిగా ఉన్నాడు ఎత్తుగా పెరిగితే బాగుండు అని ఏదో ఒక సందర్భంలో అనుకోని వారుండరు. మరి పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలి? అందుకు మార్గం ఉందా? ఎలాంటి ఆహారం ఇస్తే హైట్ పెరుగుతారు? నిపుణులు ఏం చెబుతున్నారు.

వాస్తవానికి ప్రతి వ్యక్తి ఎంత ఎత్తు పెరగాలన్నది అతడి జీన్స్ డిసైడ్ చేస్తుంది. ఎత్తు పెరగడానికి ఎలాంటి మ్యాజిక్ పిల్ లేదు. అయితే పౌష్టిక ఆహారం, ఆరోగ్య పరిస్థితులు ఎత్తుపై కొంత ప్రభావం చూపుతాయి. పిల్లలు ఎదిగే వయసులో పోషకాలు అవసరం. ఎముకలు, కండరాల ఎదుగులకు తోడ్పడుతాయి. ఆరోగ్యంగా ఎదగడానికి సాయపడతాయి.

తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలు ఎత్తుగా పెరుగుతారని, తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే వారి పిల్లలూ పొట్టిగానే ఉంటారని అనుకోవడం అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. జీన్స్ ఒక్కటే కాదు పిల్లాడి ఎదుగుదలపై అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. మెడికల్ కండీషన్స్, హార్మోన్ల లోపం ఇతర అంశాలు ఎత్తుపై ప్రభావం చూపుతాయి. కేవలం కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల పిల్లలు ఎత్తు పెరగుతారని అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే తగినంత పౌష్టికాహారం పిల్లల ఎదుగులపై ప్రభావం చూపుతుంది. వారు ఎత్తు పెరగడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. పిల్లల ఎదుగుదలకు సంబంధించి నిపుణులు పలు ఆహారాలు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు పెట్టే ఆహారంలో ఈ 10 రకాలు ఉండేలా చూస్తే పిల్లలు ఎత్తు పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. వీటిని వారి ఆహారంలో భాగం చేయాలని సూచిస్తున్నారు.

1. డెయిరీ ఉత్పత్తులు:
యూఎస్ నేషనల్ లైబ్రరీ సైన్స్ ఆఫ్ మెడిసిన్ స్టడీ ప్రకారం డైయిరీ ఉత్పత్తులు తీసుకోవడం ఎత్తుపై ప్రభావం చూపుతుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే క్యాల్షియం, విటమిన్లు కణాల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

2. నట్స్ అండ్ సీడ్స్:
డ్రైఫ్రూట్స్, నట్స్, సీడ్స్.. ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉండే మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, విటమిన్లు బీ1, బీ2, బీ3, విటమిన్-ఈ.. ఇవి ఎముకలు, కండరాల ఎదుగుదలకు ఉపయోగపడాయి.

3. గుడ్లు:
ఎగ్స్ లో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్ బీ12, రైబో ఫ్లేవిన్ అధికంగా ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు ఉంటాయి. ఏడు గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్, 5 గ్రాముల ఫ్యాట్, 1.6 గ్రాముల సాచురేటడ్ ఫ్యాట్.. వీటితోపాటు ఐరన్, విటమిన్లు, మినరల్స్. వ్యాధులతో పోరాడే న్యూట్రియంట్లు(ల్యూటిన్), జెక్సాతిన్.. ఇవన్నీ గుడ్డులో ఉంటాయి.

4. ఓట్ మీల్:
ఫైబర్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటాయి. మ్యాగనీస్, ఫాస్పరస్, కాపర్, బీ విటమిన్, ఐరన్, సెలీనియమ్, మెగ్నీషియం, జింక్ ఉంటాయి.

5. పండ్లు:
చాలా పండ్లలో అవసరమైన పీచు ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, డీ ఉంటాయి. ఫ్యాట్, సోడియం, కేలరీలు తక్కువ ఉంటాయి. పిల్లలకు అవసరమైన పోషకాలు పండ్లలో ఉంటాయి. పొటాషియం, ఫైబర్, విటమిస్, ఫోల్టే అందుతాయి.

6. ఫిష్(చేపలు):
ప్రోటీన్స్, విటమిన్ డీ చేపల్లో మెండుగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుదలకు తోడ్పడతాయి. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు(డీ, బీ2-రైబోప్లేవిన్) కలిగి ఉంటాయి. ఈ సీ ఫుడ్ లో క్యాల్షియం, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. అలాగే మినరల్స్(ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం) సమృద్ధిగా ఉంటాయి.

7. అరటిపండు:
చాలా రుచిగా ఉంటుంది. తినడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. పొటాషియం, మ్యాగనీస్, క్యాల్షియమ్, విటమిన్లు బీ6, సీ, ఏ తో పాటు సాలుబుల్ ఫైబర్ ఉంటుంది. ఎదిగే పిల్లలకు అరటి ముఖ్యమైన పండు.

8. చికెన్:
కణాలు, కండరాల ఎదుగుదలకు ముఖ్యమైన ఆహారం. హై క్వాలిటీ డైటరీ ప్రోటీన్ కలిగి ఉంటుంది. కండరాలు, ఎముకల పెరుగుదల ఉపయోగపడుతుంది.

9. సోయాబీన్:
ఇందులో ఫోల్టే, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. సాచురేటడ్ ఫ్యాట్ తక్కువ మోతాదులో ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ సి, ఫొల్టే సమృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్ మంచి ఆహారం. పిల్లల ఎదుగుదలకు చక్కని ఫుడ్.

10. కూరగాయలు:
మినరల్స్, విటమిన్స్, ఫైబర్.. ఇవన్నీ ఒకే ఆహారంలో కావాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కూరగాయలు బెస్ట్. న్యూట్రియంట్లు, విటమిన్లు ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఫొల్టే, విటమిన్ కే, మెగ్నీషియం, క్యాల్షియమ్, ఐరన్, పొటాషియమ్ సమృద్ధిగా ఉంటాయి. కూరగాయలపై ఉండే ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే. వాటికి వాము, జీరా పొడి కలిసి రుచికరమైన రోటీలు, పూరీలు, పరాటాలు చేసుకోవచ్చు.