High protein: డైటింగ్ చేస్తున్న‌ప్పుడు ప్రొటీన్ అధిక మోతాదులో తీసుకుంటే..?

డైటింగ్ చేసేవారు అధిక మోతాదులో ప్రొటీన్ ఉండే ఆహార పదార్థాల‌ను తీసుకుంటే లీన్ బాడీ మాస్ (శ‌రీర మొత్తం బ‌రువు నుంచి శ‌రీరంలోని కొవ్వు బ‌రువును తీసేస్తే వ‌స్తుంది) త‌గ్గ‌కుండా కాపాడుకోవ‌చ్చ‌ని, అలాగే, ఇది డైటింగ్ చేసేవారికి ఉత్త‌మ ఆహారమ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

High protein: డైటింగ్ చేస్తున్న‌ప్పుడు ప్రొటీన్ అధిక మోతాదులో తీసుకుంటే..?

High protein: మారుతోన్న జీవ‌న‌శైలి, ఉరుకుల ప‌రుగుల జీవితం, వ్యాయామంలేమి కార‌ణంగా చాలా మంది ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఆ త‌ర్వాత దానికి తోడు ఎన్నో రోగాలు మ‌నిషిని చుట్టుముడుతుంటాయి. దీంతో బ‌రువు పెర‌గ‌కుండా చాలా మంది డైటింగ్ చేస్తుంటారు. ఆ స‌మ‌యంలో ఏ ఆహార ప‌దార్థాలు తీసుకోవాల‌న్న దానిపై ఎంతో శ్ర‌ద్ధ పెడుతుంటారు. ఇటువంటి వారిపై ప‌రిశోధ‌న చేసిన శాస్త్ర‌వేత్త‌లు ప్రొటీన్‌ను అధికంగా తీసుకునే వారిలో చాలా మంచి మార్పులు క‌న‌ప‌డ్డాయ‌ని తెలిపారు.

Madhya Pradesh: ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్ల‌ను ప‌ట్టుకున్న పులి.. వీడియో

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఒబెసిటీ జర్నల్‌లో ప్ర‌చురించారు. డైటింగ్ చేసేవారు అధిక మోతాదులో ప్రొటీన్ ఉండే ఆహార పదార్థాల‌ను తీసుకుంటే లీన్ బాడీ మాస్ (శ‌రీర మొత్తం బ‌రువు నుంచి శ‌రీరంలోని కొవ్వు బ‌రువును తీసేస్తే వ‌స్తుంది) త‌గ్గ‌కుండా కాపాడుకోవ‌చ్చ‌ని, అలాగే, ఇది డైటింగ్ చేసేవారికి ఉత్త‌మ ఆహారమ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాలు కొన‌సాగించిన 200 మంది తీసుకున్న‌ ఆహారానికి సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించి వారు ఈ ప‌రిశోధ‌న చేశారు.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

ఆహారంలో క్ర‌మంగా ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పెంచుకుంటూపోతూ, అలాగే, ఆకు కూర‌లు అధికంగా తింటూ ఉండేవారిలో మంచి ఫ‌లితాలు క‌న‌ప‌డ్డాయ‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. అదే స‌మ‌యంలో వారు శుద్ధి చేసిన ఆహార ధాన్యాలు, చ‌క్కెర జోడించి విక్ర‌యించే ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉన్నార‌ని తెలిపారు.